వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఏపీకి రీసైక్లింగ్‌ హబ్‌?

Chakravarthi Kalyan
చాలా మంది కొనుకున్న వాహనాలు 15 సంవత్సరాలు దాటిపోయిన వాటిని వదిలి కొత్త వాటిని కొనుగోలు చేయాలని అనుకుంటారు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. పాత వాహనం ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయి ఉంటదో వాటికి సంబంధించి మరో వాహనం తీసుకోవాలంటే ఎక్కువగా ట్యాక్స్ లు చెల్లించాల్సి వస్తోంది. విపరీతమైన ట్యాక్స్ ల భారం పడుతుంది.


రికార్డుల్లో రెండు బండ్లు ఉంటాయి. పాత బండిని ఎవరు కొనరు. దీంతో ఎప్పటికీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. దీనికి పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం స్క్రాప్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. అందులో ఆంధ్ర ప్రదేశ్ కు రెండు సెంటర్లను ఇచ్చింది. అందులో ఒకటి గుంటూరు, రెండోది జగ్గయ్యపేటలో ఏర్పాటు చేయనున్నారు.


పాత వాహనాలు అధికారికంగా స్వచ్ఛందంగా స్క్రాప్ గా మార్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గ దర్శకత్వాలు ఇచ్చింది. 15 ఏళ్లు దాటినా వాహనాలను స్క్రాప్ కిందకు వేయాలని, మూలకు పడేసిన వాటిని, ప్రభుత్వ, ప్రైవేటు, ఆర్టీసీ సంస్థల్లో ఉన్న పాత వాహనాలను స్క్రాప్ కిందకు మార్చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. యజమానులు స్వచ్ఛంద ప్రాతిపదికన స్క్రాప్ విధానాన్ని తీసుకొచ్చారు.


ప్రభుత్వ పరంగా హిందుస్తాన్ రీసైక్లింగ్ హబ్ ను గుంటూరులో ఏర్పాటు చేస్తున్నారు. స్వచ్ఛందంగా స్క్రాప్ కిందకు వేస్తే మార్కెట్ ధర ప్రకారం.. ఇంజిన్, ఇతర సామగ్రి విలువను డిసైడ్ చేస్తారు. దీంతో పాటు సర్టిఫికెట్ ఇస్తారు. కొత్త వాహానం కొనుగోలు చేసేటపుడు దాని మీద 15 నుంచి 20 శాతం వరకు రాయితీ ఇచ్చే అవకాశం ఉంది. కొత్త వాహనం రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగానే చేస్తారు. కొత్త వాహనం రిజిస్ట్రేషన్ చేసి పూర్తి స్థాయిలో వాహన వివరాలు అంద జేస్తారు. ఇప్పుడు భారీ స్థాయిలో స్క్రాప్ చేయడానికి దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

AP

సంబంధిత వార్తలు: