కరోనా తలరాతను మార్చింది.. పెయింటర్ లక్షాధికారి అయ్యాడు?

praveen
సరికొత్తగా ఆలోచించే శక్తి.. ఇక ఒడిదుడుకులను ఎదుర్కొనే పట్టుదల ఉండాలి కానీ.. ఏ రంగంలోనైనా సక్సెస్ సాధించవచ్చు అని ఇటీవల కాలంలో ఎంతోమంది నిరూపిస్తున్నారు. ఇక్కడ మనం చెప్పుకోబోయేది కూడా ఇలాంటి వ్యక్తి గురించే అని చెప్పాలి. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత అందరు జీవితాలు తారుమారు అయ్యాయి. ఇక చేసే ఉద్యోగాలు కోల్పోవడమే కాదు వ్యాపారాల్లో కూడా నష్టం వచ్చి ఎంతోమంది దుర్భర జీవితాన్ని గడిపారు. ఇలా కరోనా వైరస్ ఎంతోమంది తలరాతను మార్చింది.

 ఇక్కడ ఒక వ్యక్తి విషయంలో కూడా కరోనా వైరస్ తలరాతను మార్చింది. అయితే అందరిలా దుర్భరంగా కాదు ఎంతో అద్భుతంగా కరోనా కారణంగా అతని తలరాత మారిపోయింది. అతని పేరు ప్రజ్ఞాన్ చక్మా. అతనుకేరళలో ఒక ఆర్ట్ స్కూల్ నిర్వహిస్తూ ఉండేవాడు. కానీ కరోనా వైరస్ వచ్చిన తర్వాత స్కూల్ మూతపడి ఆదాయమే లేకుండా పోయింది. దీంతో కరోనా తర్వాత అతను పశ్చిమ బెంగాల్లో ఉంటున్న అతని స్నేహితుడు ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఏడాది పొడవునా పలాలను ఇచ్చే మామిడి చెట్లను చూశాడు. రైతుగా మారాలని ఆలోచన అతని మనసులో తట్టింది.

 కాగా ఇక అతనికి ఉన్న నాలుగు ఎకరాలలో ఆ ప్రత్యేకమైన మామిడి పండ్లను పండించడం మొదలుపెట్టాడు. అప్పటివరకు తాను సంపాదించిన మొత్తాన్ని కూడా ఆ మామిడి తోట మీదనే పెట్టుబడిగా పెట్టాడు. ఇలా అన్ని సీజన్లలో కూడా పండే మామిడిపండు పేరు మియాజాకీ. 1940లో కాలిఫోర్నియాలో ఉత్పత్తి చేసినప్పటికీ జపాన్లోని మియా జాకీ ప్రాంతంలో బాగా ఈ మామిడి పండ్లు సాగు చేసేవారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ఈ మామిడి పండు కిలో ధర ఏకంగా 2.7 లక్షల రూపాయలు అంటే ఒక్క పండు ధర దాదాపు 40 వేల రూపాయలు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అందుకే ఇంత డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఈ మామిడి పండ్లు మార్కెట్లో అమ్ముతున్నాడు. కిలో 1500కే విక్రయిస్తున్నాడు. గత ఏడాదిగా 20 కిలోలు విక్రయించగా.. ఈ ఏడాది తన విక్రయాలు రెట్టింపు అయ్యాయి. దీంతో అతను లక్షలు సంపాదిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: