ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన కెనరా బ్యాంకు రూపే క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ చెల్లింపులను స్టార్ట్ చేస్తున్నట్లు పేర్కొంది. కెనరా ఏఎల్ 1 బ్యాంకింగ్ సూపర్ యాప్‌లో ఈ సదుపాయం అనేది అందుబాటులోకి వచ్చినట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సదుపాయం గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక కెనరా బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా వ్యాపారులకు యూపీఐ చెల్లింపుల సౌకర్యాన్ని పరిచయం చేసింది. ఎన్‌పిసిఐతో కలిసి ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టిన ఫస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ గా కెనరా బ్యాంక్ అవతరించింది.ఇంకా ఈ కొత్త సదుపాయంతో, బ్యాంక్ కస్టమర్‌లు ఇప్పుడు వారి రూపే క్రెడిట్ కార్డ్‌ల నుంచి వ్యాపారులకు యూపీఐ చెల్లింపులని చేయగలుగుతారు. అలాగే వారు తమ కెనరా బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్‌లను వారి యూపీఐ ఐడీలకు కూడా లింక్ చేయవచ్చు. ఈ సదుపాయం అనేది డిజిటల్ చెల్లింపు పద్ధతిని అత్యంత సులభంగా చేయడానికి వీలు కల్పిస్తుందని బ్యాంక్ ప్రతినిధులు కూడా చెబుతున్నారు.
ఇంకా అలాగే యూపీఐతో క్రెడిట్ కార్డ్‌ను లింక్ చేసే విధానం ఇప్పటికే ఉన్న ఖాతా లింకింగ్ విధానాన్ని పోలి ఉంటుంది. లింక్ చేయడానికి ఖాతా లిస్టింగ్ సమయంలో కస్టమర్‌లు కెనరా క్రెడిట్ కార్డ్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. రూపే క్రెడిట్ కార్డ్‌ని వాడి యూపీఐ చెల్లింపులకు, యూపీఐ లావాదేవీలకు వర్తించే లావాదేవీ పరిమితులు కొనసాగుతాయని బ్యాంకు ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ఈ సదుపాయం అనేది డిజిటల్ చెల్లింపులను మరింత మెరుగుపరుస్తుందని, ఇంకా యూపీఐ పర్యావరణ వ్యవస్థను విస్తరిస్తుందని బ్యాంక్ పేర్కొంది. యూపీఐలో రూపే క్రెడిట్ కార్డ్ ఏకీకరణ యూపీఐ సౌలభ్యాన్ని రూపే క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలతో సులభంగా మెర్జ్ చేయడం ద్వారా విశేషమైన వినియోగదారు అనుభవాన్ని అందజేస్తుందని అన్నారు. ముఖ్యంగా, కెనరా బ్యాంక్ ఈ ఫెసిలిటీని ఉపయోగించి ప్రస్తుతం వ్యాపారి చెల్లింపులు మాత్రమే అనుమతిస్తారు. ఇక రూపే క్రెడిట్ కార్డ్‌ల నుంచి యూపీఐ చెల్లింపులకు వ్యక్తి నుంచి వ్యక్తికి కార్డ్ నుంచి లేదా క్యాష్-అవుట్ లావాదేవీలు అనుమతిస్తారు.