Amazon: భారీగా ఉద్యోగులు తొలగింపు..?

Purushottham Vinay
Amazon: ఆర్ధిక మాంద్యం కారణంగా గత కొన్ని నెలలుగా టాప్ కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూ ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. మెటా , అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ , ఆల్ఫాబెట్‌ , బైజూస్‌ వంటి అనేక టాప్ కంపెనీలు దశల వారీగా తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి.ఇలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ కంపెనీలలో ఉద్యోగుల తొలగింపు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే చాలా మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన అమెజాన్ కంపెనీ..ఇక తాజాగా మరో విడత ఉద్యోగాల కోతకు రెడీ అవుతుంది. ఈసారి సంస్థలోని వివిధ విభాగాలలో పనిచేస్తున్న మొత్తం 9 వేల మందిని ఉద్యోగం నుంచి తొలగించనున్నట్లు సోమవారం నాడు ప్రకటించింది.ప్రధానంగా క్లౌడ్ ఇంకా ప్రకటనల విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులనే తొలగించనున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఆర్థిక అనిశ్చితి ఇంకా సంస్థ పనితీరు మెరుగుపరుచుకోవడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ కంపెనీ వెల్లడించింది.


అమెజాన్ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇటీవల వరుస తొలగింపులతో అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్న 27 వేల మందికి కంపెనీ ఉధ్వాసన పలికింది. ఇక ఈ సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో ఇలా తొలగింపునకు గురైన వారు 9 శాతం ఉన్నారు.ఇంకా మిగతా విభాగాల ఉద్యోగుల మాటెలా ఉన్నా క్లౌడ్, ప్రకటనల విభాగంలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రతకు ఢోకా ఉండదనే అభిప్రాయాలు కూడా ఉండేవి. ఈ రెండు విభాగాలు అమెజాన్ కంపెనీకి భారీగా లాభాలు తెచ్చిపెడుతున్నాయి. అయితే, ఆర్థిక అనిశ్చితి ఈ రెండు విభాగాలలో ఎంప్లాయిస్ ని తొలగించేదాకా చేరిందని అమెజాన్ ఉద్యోగవర్గాలు తెలిపాయి. ఇక మరోసారి ఉద్యోగుల తొలగింపు ప్రకటన చేయడంతో అమెజాన్ స్టాక్ విలువ దాదాపు 2 శాతం మేర పడిపోవడం జరిగింది.ఇలా ప్రముఖ కంపెనీలు అన్నీ తమ ఉద్యోగులని తొలగిస్తుండటంతో చాలా మంది ఉద్యోగులు ఎంతగానో భయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: