ఆధార్ : ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు ?
ప్రస్తుత రోజుల్లో మన దేశంలో ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైన పత్రమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆధార్ లేనిదే దేశంలో అసలు ఏ పని జరగదు. ఆధార్ లేకపోతే భారతీయునిగా అస్సలు గుర్తించబడరు. దేశంలో ప్రతి పనికీ కూడా ఆధార్ కార్డ్ ఖచ్చితంగా కావాల్సిందే.అసలు ఆధార్ కార్డులేనిదే ఏ ప్రభుత్వ పథకం కూడా మనకు అందదు. కనీసం మనం సిమ్ కార్డుని కూడా తీసుకోలేం. బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయాలన్నా కూడా ఈరోజుల్లో ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాల్సిందే. ఇంత ముఖ్యమైన కార్డు కాబట్టి అందులో ఎలాంటి తప్పుల్లేకుండా చూసుకోవడం కూడా మనకు చాలా ముఖ్యం. ఆధార్ లో మీ వివరాలలో పొరపాటు ఉంటే.. వెంటనే వాటిని సరిదిద్దుకోండి. అయితే మీ పేరు, పుట్టిన తేదీ, చిరునామా ఇంకా అలాగే లింగాన్ని ఎన్నిసార్లు మార్చవచ్చో మీకు తెలుసా.. అయితే భద్రతా సమస్యల కారణంగా కొన్ని పరిమితులు ఉన్నాయి.
ఇక యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం..ఇక ఆధార్ కార్డులో మీ పేరును రెండుసార్లు ఈజీగా ప్రారంభించవచ్చు.అలాగే మీ పుట్టిన తేదీని మీరు ఎప్పటికీ మార్చలేరు. అయితే డేటా ఎంట్రీ సమయంలో చేసిన పొరపాటును ఈజీగా సరిదిద్దుకోవచ్చు. ఇంకా అలాగే మీరు ఆధార్‌లో మీ లింగాన్ని ఒక్కసారి మాత్రమే మార్చుకోవచ్చు.మీరు uidai ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించి.. ఆధార్ పేరు, లింగం ఇంకా అలాగే పుట్టిన తేదీని మళ్లీ మార్చుకోవచ్చు. అలాగే మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఇంకా ఫోటోను కూడా మార్చడానికి పరిమితి లేదు.ఇంకా నిర్దిష్ట కాలపరిమితి కంటే ఎక్కువ మీరు ఆధార్‌లో పేరు, లింగం ఇంకా పుట్టిన తేదీని మార్చలేరని uidai సమాచారం తెలిపింది. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకొని ఆధార్ కార్డులో మార్పులు చేసుకోండి. లేదంటే ఇబ్బందుల్లో పడతారు.