LIC: ఈ పాలసీతో మీ కూతురు పెళ్లికి ఎలాంటి చింత లేదు?

Purushottham Vinay
ప్రతి మధ్య తరగతి కుటుంబం కూడా తమ పిల్లల చదువు కోసం, వివాహం కోసం డబ్బును దాచుకోవడం చాలా అవసరం. ఇది సర్వసాధారణమైన విషయం. సంపాదిస్తున్న డబ్బును దాచుకోవడం కోసం ఒక్కొక్కరు ఒక్కో రకమైన మార్గాన్ని ఎంచుకుంటారు. ఇక ఇలాంటి వారి కోసమే ప్రముఖ ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ఒక మంచి స్కీమ్‌ను తీసుకొచ్చింది.ఎల్‌ఐసీ కన్యాదాన్‌ పాలసీ పేరుతో తీసుకొచ్చిన ఈ స్కీం ద్వారా కూతురు పెళ్లి కోసం డబ్బును పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఇంకా ఈ పాలసీలో భాగంగా కుమార్తె పేరుపై 22 ఏళ్ల దాకా నెలకు రూ. 3600 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా 25 సంవత్సరాల పాటు చెల్లిస్తే తర్వాత రూ. 26 లక్షలు పొందొచ్చు. అయితే నెలవారీ ప్రీమియంను తక్కువగా ఎంపిక చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఇక పాలసీ తీసుకున్న మూడేళ్ల తర్వాత లోన్ కూడా పొందొచ్చు.


దీంతో పాటు ప్రీమియం డిపాజిట్‌పై 80C కింద మీకు మినహాయింపు అనేది లభిస్తుంది. సెక్షన్ 10D కింద మెచ్యూరిటీ మొత్తం పన్ను రహితం. పాలసీకి సమ్ అష్యూర్డ్ పరిమితి మినిమం రూ.1 లక్ష నుంచి ప్రారంభమవుతుంది గరిష్ట పరిమితి అనేది ఉండదు.పాలసీ కాల పరిమితి 13 నుంచి 25 సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ పాలసీ తీసుకోవడానికి తండ్రి వయసు ఖచ్చితంగా 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. మాక్సిమం మెచ్యూరిటీ వయస్సు 65 సంవత్సరాలు. ఇక కుమార్తె వయసు విషయానికొస్తే.. ఖచ్చితంగా 1 నుంచి 10 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రీమియంను నెలవారీ లేదా త్రైమాసికం, ఆఫర్‌ ఇయర్‌ ఇంకా ఇయర్లీగా చెల్లించవచ్చు. ఒకవేళ పాలసీ తసుకున్న కొంత కాలానికి తండ్రి కనుక చనిపోతే కుటుంబం పాలసీని చెల్లించాల్సిన పని లేదు. ప్రీమియం మొత్తం కూడా మాఫీ అవుతుంది. దీంతో పాలసీ ఫ్రీగా అమలవుతుంది. మెచ్యూరిటీ సమయం నాటికి ఆ మొత్తం కూడా నామినీకి అందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

LIC

సంబంధిత వార్తలు: