రైల్వే ప్రయాణికులకు ఆ సౌకర్యాలు?
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. పండుగ సమయంలో సొంతూళ్లకు వెళ్లేవారికి రైలు టికెట్ల కన్ఫర్మేషన్ పెద్ద సమస్యగా మారుతోంది. 2-3 నెలల ముందే టికెట్ తీసుకున్నా వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉండటం జరుగుతోంది. అయితే ఈ సమస్యను వికల్ప్ పధకం ద్వారా పరిష్కరించవచ్చు. వెయిటింగ్ టిక్కెట్లు కన్ఫర్మ్ కాని ప్రయాణీకులకు భారతీయ రైల్వే.. వికల్ప్ పధకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కీం కింద వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు మరొక ప్రత్యామ్నాయ రైలులో సీట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు.రైల్వే ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్. ఇక నుంచి రైల్లో వేరొకరి టికెట్‌పై మీరు ఈజీగా ప్రయాణం చేయవచ్చు. మీకు టికెట్ బుక్ కాకపోయినా..ఈ సౌకర్యంతో ఈజీగా ప్రయాణం చేసేయొచ్చు.ఇండియన్ రైల్వేస్ తాజాగా ఓ నిబంధన అమలులోకి తీసుకొచ్చింది. మీ కుటుంబం సభ్యుల టికెట్‌పై ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించింది.అయితే మీరు ఎవరి టికెట్‌పై ప్రయాణించాలని అనుకుంటున్నారో.. వారు మీకు రక్త సంబంధీకులై ఉండాలి.
ఉదాహరణకు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, జీవిత భాగస్వామి లేదా పిల్లల పేరిట టికెట్ ఉంటే మీరు వారి టికెట్‌పై సులభంగా ప్రయాణించవచ్చు. అయితే దీనికంటూ ఓ ప్రాసెస్ ఉంది.ఫస్ట్ ప్రయాణించాల్సిన వ్యక్తి పేరు బదులుగా.. ఎవరైతే ఆ టికెట్‌పై ప్రయాణించాలనుకుంటున్నారో.. అతడి పేరును నమోదు చేయాల్సి ఉంటుంది. దీని కోసం ట్రైన్ బయల్దేరే 24 గంటల ముందుగా మీరు సంబంధిత రైల్వే అధికారులకు అవసరమైన డాక్యుమెంట్స్‌తో దరఖాస్తు చేసుకోవాలి. వాటిని అధికారులు పరిశీలించి.. ఆ తర్వాత టికెట్‌పై ప్రయాణించాల్సిన సభ్యుడి పేరును ఉంచుతారు.ఇంకా అలాగే విద్యాసంస్థల విద్యార్థులకు టికెట్ బదిలీ సౌకర్యాన్ని కూడా భారతీయ రైల్వే అందిస్తోంది. అటువంటి పరిస్థితిలో బయలుదేరడానికి 48 గంటల ముందు అవసరమైన పత్రాలతో లెటర్‌హెడ్‌పై ఇనిస్టిట్యూట్ హెడ్ రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకుంటే.. దాన్ని రైల్వే అధికారులు చెక్ చేస్తారు. ఆ తర్వాత మీకు టికెట్ కన్ఫర్మ్ చేస్తారు.