ఇక మీరు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే.. మీకు అనేక రకాల ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. అయితే ప్రభుత్వంతో కూడా మీరు వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.అలాగే ఇందులో మీరు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.ఇక ఆధార్ సెంటర్ ఫ్రాంచైజీ కోసం ఎలాంటి పెట్టుబడి లేకుండానే నెలలో ఈజీగా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. ఈ ఫ్రాంచైజీని తీసుకోవడం ద్వారా మంచి ఆదాయం వస్తుంది. పైగా ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్లు ఇంకా ముందస్తు పెట్టుబడి అవసరం లేదు.అయితే దేశంలో నివసించే ప్రతి పౌరుడికి ఆధార్ కార్డ్ కలిగి ఉండటం చాలా ముఖ్యం, ఆధార్ కార్డ్ అనేది ప్రస్తుతం చాలా ముఖ్యమైన పత్రాల్లో ఒకటిగా మారింది. ఈ కారణంగా దీనికి అధిక డిమాండ్ అనేది ఉంది. ఇక మీరు ఆధార్ కార్డ్‌ని ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే దీని కోసం మొదట మీరు uidai నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. ఆపై మీకు సేవా కేంద్రాన్ని తెరవడానికి లైసెన్స్ కూడా ఇవ్వబడుతుంది. అలాగే మీరు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్ ఇంకా బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయాలి.ఇంకా దీని తరువాత.. కామన్ సర్వీస్ సెంటర్ నుంచి రిజిస్ట్రర్ చేసుకోవలసి ఉంటుంది.
ఇక మీరు ఆధార్ ఫ్రాంచైజీ లైసెన్స్ పొందడానికి.. ముందుగా NSEIT అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అక్కడ Create New Userపై మీరు క్లిక్ చేయాలి. అందులో క్లిక్ చేసిన తర్వాత కొత్త ఫైల్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇక దీనిలో మీరు షేర్ కోడ్‌ను నమోదు చేయమని అడుగుతారు. అలాగే షేర్ కోడ్ కోసం.. మీరు ఆఫ్‌లైన్ ఈ-ఆధార్‌కి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది డౌన్‌లోడ్ చేసిన తర్వాత.. మీరు xml ఫైల్ ఇంకా షేర్ కోడ్ రెండింటినీ డౌన్‌లోడ్ చేస్తారు.ఇక దరఖాస్తు చేస్తున్నప్పుడు స్క్రీన్‌పై ఒక ఫారమ్ ఓపెన్ అవుతుంది. అందులో అడిగిన మొత్తం సమాచారాన్ని కూడా పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. దీంతో యూజర్ ID, పాస్వర్డ్ మీ ఫోన్ ఇంకా ఈ-మెయిల్ కు వస్తాయి. వాటిని ఉపయోగించి ఆధార్ టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ పోర్టల్‌కి మీరు సులభంగా లాగిన్ కావచ్చు. ఇక ఆ తర్వాత మీకు కంటిన్యూ ఆప్షన్ కనిపిస్తుంది.. దానిపై మీరు క్లిక్ చేయండి. ఆ తరువాత ఓపెన్ ఆయిల్ ఫారమ్ లో అడిగిన సమాచారాన్ని అందించాలి. ఇక వివరాలు చెక్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేస్తే ప్రక్రియ పూర్తవుతుంది. ఇంకా ఆ తరువాత వినియోగదారులకు మీరు సేవలను అందించటం ప్రారంభించవచ్చు.