ఆన్లైన్లో PF అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఎలా?
Step 1: ముందుగా నెట్ ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌కు మీరు వెళ్లాలి. అక్కడ సర్వీసెస్‌లో ఎంప్లాయిస్ సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత యూఏఎన్ ఆన్లైన్ సర్వీస్‌పై మీరు క్లిక్ చేయాలి. అప్పుడు యూఏఎన్ నెంబర్ ఇంకా అలాగే పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
Step 2: ఇక లాగిన్ అయిన తర్వాత ఆన్లైన్ సర్వీస్‌పై కర్సర్ పెట్టగా అక్కడు ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనేది మీకు కనిపిస్తుంది. ఇక దానిపై మీరు క్లిక్ చేయాలి.
Step 3: ఆ తరువాత వ్యక్తిగత వివరాలు మీరు సరిచూసుకోవాలి. ఆ తర్వాత ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీ వివరాలు మీరు నమోదు చేయాలి.
Step 4: ఇక అభ్యర్థులు మునుపటి ఉద్యోగానికి సంబంధించిన PF ఖాతా కనిపించే ‘వివరాలను పొందండి’ ఎంపికపై కూడా క్లిక్ చేయాలి.
Step 5: అలాగే EPFO సభ్యులు ఇప్పుడు ఫారమ్‌ను ధృవీకరించడానికి మునుపటి యజమాని లేదా ప్రస్తుత యజమాని ఎంపికలను ఎంచుకోవాలి.
Step 6: అలాగే UAN నమోదిత మొబైల్ నంబర్లో OTPని స్వీకరించడానికి సభ్యులు ‘గెట్ OTP’ ఎంపికపై క్లిక్ చేయాలి.
Step 7: ఇక చివరగా, EPFO సభ్యులు OTPని నమోదు చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
ఈ విధంగా మీరు ఈజీగా పైన తెలిపిన దశల ప్రకారం ఆన్లైన్ లోనే పిఎఫ్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.