పోస్ట్ ఆఫీస్ అకౌంట్ వున్న వారికి ఏప్రిల్ నుంచి న్యూ రూల్..!!

Purushottham Vinay
ఇక మీకు పోస్ట్ ఆఫీస్‌లో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) ఇంకా అలాగే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) ఇంకా అలాగే టైమ్ డిపాజిట్ అకౌంట్లకు ఇండియా పోస్ట్ ఏప్రిల్ 1 వ తేదీ నుంచి కూడా కొత్త రూల్స్ అనేవి అమలుచేయనుంది.ఇక ఈ స్కీమ్‌ల ద్వారా ప్రతీ నెల, మూడు నెలలకు ఇంకా అలాగే ఏడాదికి ఓసారి వచ్చే వడ్డీని నగదు రూపంలో ఇకపై ఇండియా పోస్ట్ అనేది ఇవ్వదు. వడ్డీని కేవలం సేవింగ్స్ అకౌంట్‌లో జమ చేస్తుంది.అలాగే ఖాతాదారులు సేవింగ్స్ అకౌంట్ నుంచే తమకు వచ్చిన వడ్డీని విత్‌ డ్రా చేసుకోవచ్చునట. ఇక ఈ కొత్త రూల్ 2022 ఏప్రిల్ 1 వ తేదీ నుంచి అమలులోకి రావడం అనేది జరుగుతుంది. ఇక అలాగే మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) ఇంకా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) ఇంకా టైమ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా వచ్చే వడ్డీని 2022 ఏప్రిల్ 1 వ తేదీ నుంచి కూడా ఖాతాదారుల పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లేదా బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తామని ఇండియా పోస్ట్ సర్క్యులర్ విడుదల చేయడం అనేది జరిగింది.


ఇక ఈ సర్క్యులర్ ప్రకారం తెలిసిన సమాచారం ఏంటంటే..ఖాతాదారులు ఇక తమ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లేదా బ్యాంక్ అకౌంట్‌ను మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) ఇంకా అలాగే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) ఇంకా అలాగే టైమ్ డిపాజిట్ స్కీమ్‌లకు 2022 మార్చి 31 లోగా లింక్ అనేది ఖచ్చితంగా చేయాలి. అలా కనుక లేకపోతే ఆ వడ్డీ సంబంధిత MIS/SCSS/TD అకౌంట్లలో జమ అనేది అవుతుంది. ఇక రావాల్సిన వడ్డీని సేవింగ్స్ అకౌంట్‌లోకి జమ అనేది చేయించుకోవచ్చు. లేదా చెక్ ద్వారా అయిన తీసుకోవచ్చు. ఇక 2022 ఏప్రిల్ 1 వ తేదీ తర్వాత నగదు రూపంలో వడ్డీ అనేది మాత్రం రాదు. ఇక ఈ పద్ధతి ద్వారా ఖాతాదారులు పోస్ట్ ఆఫీసుకి రావాల్సిన అవసరం లేకుండానే వడ్డీ అనేది చాలా ఈజీగా పొందొచ్చు. ఇక వడ్డీ తీసుకోవడానికి వేర్వేరు ఫామ్స్ ఫిల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రతీ నెల ఇంకా అలాగే మూడు నెలలకు ఇంకా అలాగే ఏడాదికి ఓసారి వడ్డీ నేరుగా అకౌంట్‌లో జమ అనేది అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: