ఆ వార్షిక సదస్సు ఇక వేసవిలోనేనా ?.. అదీ డౌటే


ప్రభుత్వాధినేతలంతా ఒక చోట చేరితే ఎలా ఉంటుంది ? తమ దేశాలలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారు వివరిస్తే ఎలా ఉంటుంది ? పెట్టుబడుల స్వర్గధామాలన్ని గుంపుగా గుమి కూడీతే ఎలా ఉంటుంది ?... వ్యాపార వాణిజ్య వేత్తలకు అంత కన్నా కావలసింది ఏమి ఉంటుంది .... కానీ ఈ సారి ఆ అవకాశం లేదు. కనుచూపు మేరలోనూ కనిపించడం లేదు.... కారణం?
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్... డబ్లూఇఎఫ్ వచ్చే నెల దావోస్‌లో తన వార్షిక సమావేశాన్ని వాయిదా వేసింది, స్విట్జర్లాండ్  తో పాటు,  ప్రపంచ వ్యాప్తంగా   కరోనావైరస్ తాజా వేేరియంట్  ఒమిక్రాన్ ప్రభావం కారణంగా రెండవ సంవత్సరం కూడా అడ్డుకుంది.
సమావేశాన్ని జనవరి 17-21 వరకు నిర్వహించాలని భావించినందున, ఓమిక్రాన్ వేరియంట్‌పై "నిరంతర అనిశ్చితి"  కారణంగా పునరాలోచించవలసి వచ్చిందని ఫోరమ్ తెలిపింది. రానున్న వేసవి ప్రారంభంలో సమావేశాన్ని నిర్వహించాలని యోచిస్తున్నట్లు కూడా ఫోరమ్  ప్రకటించింది. మహమ్మారి సృష్టించిన పరిస్థితులు నేరుగా సమావేశాలు నిర్వహించడాన్ని కష్టతరం చేశాయని తెలిపింది.  "సమావేశం యొక్క కఠినమైన ఆరోగ్య ప్రోటోకాల్‌లు ఉన్నప్పటికీ, ఓమిక్రాన్  దాని వ్యాప్తి  కారణంగా  ప్రభావం వాయిదా వేయడం అవసరం." అని పేర్కోంది.
 
 స్విట్జర్లాండ్ అంతర్జాతీయ ప్రయాణానికి ద్వారాలు తెరిచి ఉన్నందున  ఈ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వగలమని వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు. కానీ వేగంగా వ్యాప్తి చెందుతున్న ఓమిక్రాన్  వ్యాప్తి కారణంగా వారి ప్రణాళికలు, వారి ఆశలు నీరు కారాయని చెప్పవచ్చు. అంటువ్యాధులను అరికట్టడానికి,  ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను రక్షించడానికి స్విట్జర్లాండ్  రెండు రోజులు నుంచి  పరిమితులను కఠినతరం చేసింది. ఇది వర్క్ ఫ్రమ్ హోం ను తిరిగి ప్రవేశపెట్టింది. కోవిడ్-19 టీకాలు వేసుకోని వారు బాహ్యప్రపంచంలోకి  అత్యవసరం అయితే మినహా వెలుపలికి రావద్దని విజ్ఞప్తి చేసింది.
ఆంక్షల నేపథ్యంలో ఆకాంక్షలు వెలవెలబోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ  వ్యాపార ప్రముఖులు ఒక చోట చేరే దావోస్ ఈ సారి కూడా నేతలు రాక, సమావేశాలో జరుగక బోసిపోనుంది.వేసవిలో నిర్వహిస్తామని నిర్వహకులు చెబుతున్నా.. అది కూడా జరిగే అవకాశం లేదని వారే  మీడియాకు సూచన ప్రాయంగా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: