నా జీతం చూసి పిల్లను కూడా ఇవ్వలేదు : పేటియం సీఈవో

praveen
ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ మార్కెట్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ అతి పెద్ద డిజిటల్ పేమెంట్ సంస్థ గా మారిపోయింది పేటీఎం. ఒక సాదాసీదా సంస్థ స్థాయి నుంచి ఇక ఎప్పుడూ నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. అనతికాలంలోనే దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించింది పేటీఎం. ఇక డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం అటు ఐపీఓ  మార్కెట్ లోకి కూడా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. భారత చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ గా స్టాక్ మార్కెట్ లోకి అడుగుపెట్టి యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. అయితే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి తక్కువ సమయంలోనే ఏకంగా తన టాలెంట్ తో కుబేరుడు గా మారడం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది..


 ఎంతో మంది యువ పారిశ్రామిక వేత్తలకు ఇక ప్రస్తుతం పేటియం సీఈవో స్టోరీ కాస్త ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది అనే చెప్పాలి. ఇటీవలే ఇటీవలే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టింగ్ సందర్భంగా పేటియం సీఈవో విజయ్ శేఖర్ శర్మ మాట్లాడుతూ ఇక సంస్థ ఎదిగిన తీరును గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇక అంతకు ముందుగా ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేటియం సీఈవో విజయశేఖర్ వర్మ తన లైఫ్ స్టోరీ గురించి వివరించారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత 27 ఏళ్ల వయస్సు ఉన్న సమయంలో తాను ఓ సంస్థను స్థాపించి మొబైల్ కంటెంట్ విక్రయించడం ప్రారంభించా అంటూ చెప్పుకొచ్చారు విజయ్ శేఖర్ శర్మ.. ఆ సమయంలో తనకు కేవలం 10 వేలు మాత్రమే ఆదాయం వచ్చేది అంటూ తెలిపాడు.

 ఇక ఆ సమయంలో తనకు పిల్లను ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా ఎన్నో రోజుల పాటు పెళ్లికి అర్హతలేని బ్యాచిలర్ గానే జీవితాన్ని కొనసాగించా అంటూ తెలిపాడు. ఆ సమయంలో ఇక కంపెనీ మూసివేసి 30 వేల రూపాయల జీతం వచ్చే ఒక ఉద్యోగంలో చేరాలి అంటూ మా నాన్న సలహా ఇచ్చారు అంటూ గుర్తు చేసుకున్నారు. అలాంటి పరిస్థితుల నుంచి ప్రస్తుతం 18 వేల కోట్ల భారత స్టాక్ మార్కెట్ లో అడుగు పెట్టి చరిత్ర సృష్టించడం ఎంతో గర్వంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఇక విజయశేఖర్ వర్మ జీవితం ఎదుర్కొన్న ఆటుపోట్లు మాత్రంనేటి తరం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయ్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: