ఎయిర్ ఇండియా.. టాటాకు భారమే.. !

Chandrasekhar Reddy
ప్రభుత్వ సంస్థలు అప్పులలో కురుకుపోతూన్నాయని ప్రభుత్వం వాటిని ప్రైవేట్ భాగస్వామ్యంతో ముందుకు నడిపే యత్నం చేస్తుంది. ఈ ప్రయత్నం లోనే ఇప్పటికే కొన్ని ప్రధాన సంస్థలను ప్రైవేట్ వారికి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ విధానం ద్వారా ఆయా ఆస్తులను ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా నిర్వహిస్తున్నట్టు ఆర్థిక మంత్రి కూడా తెలిపారు. అంటే ఆస్తులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి, కేవలం నిర్వహణ మాత్రం ప్రైవేట్ వర్గాలు చేస్తాయని వారు చెప్పారు. అంతే కానీ ప్రభుత్వ ఆస్తులను అమ్మటం లేదని, సంపద సృష్టిలో ఇటువంటివి ఏ ప్రభుత్వానికైనా సహజమని వారు తెలిపారు. ఇవన్నీ గతంలో జరిగినప్పటికీ ప్రస్తుతం ఎయిర్ ఇండియా ను టాటాకు కట్టబెడుతున్నారు అనే విషయం బాగా సామజిక మాధ్యమాలలో హల్ చల్ అవడాన్ని బట్టి దానిని ముందు అప్పుల్లో ఉంది అన్నారు, ఇప్పుడు ప్రైవేట్ వారికీ ఇస్తున్నాం అంటున్నారు. ఇది పై పద్దతిలోనే ఇస్తున్నారా లేక పూర్తిగా టాటా పరం చేస్తున్నట్టేనా అనేది తెలుసుకొని మాట్లాడాలి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అయితే ఈవిషయంపై ప్రభుత్వం పై నిందలు వేస్తున్న కాంగ్రెస్ ను ఉద్దేశించి కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే స్పందించారు. అప్పుల్లో ఉన్న సంస్థ మరొకరికి కామధేనువు ఎలా అవుతుంది అని ఆయన ప్రశించారు. కొత్త యజమాని ఖచ్చితంగా అనేక దుష్ఫలితాలు ఎదుర్కోవలసి వస్తుందని ఆయన అన్నారు. విమానాల పునరుద్ధరణ కోసం టాటా భారీగా ఖర్చుపెట్టాల్సి వస్తుందని ఆయన అన్నారు. అయితే కొత్త యజమానికి ఉన్న ఏకైక ప్రయోజనం అప్పుల నుండి తప్పించుకోవడమే. ఈ విషయంలో ఆ సంస్థ తాను భరించగలిగిన అప్పులను మాత్రమే తీసుకోవడంలో విజయం సాధించిందని అన్నారు. ఇది చాలు ఆ సంస్థ చాలా వరకు బయట పడినట్టే అన్నారు.
ఈ ఎయిర్ ఇండియా సంస్థను టాటా కు అమ్మేయడం వలన ప్రజల మీద పడుతున్న 20కోట్ల భారం తగ్గిందని పాండే తెలిపారు. ఇంకా ప్రభుత్వం చేతిలోనే ఉంటె ఇప్పటికి ఆ భారం ప్రజలు పన్ను రూపం లో చెల్లించాల్సి వచ్చేదని అన్నారు. అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి కాస్త భారం తగ్గినట్టే అన్నారు ఆయన. ఇక ఉన్న ఉద్యోగులను ఏడాది పాటు కదిలించడానికి వీలులేదని, అనంతరం కూడా స్వచ్చంద పదవి విరమణ ద్వారా మాత్రమే వారిని తీసేయడానికి కుదురుతుందని ఆయన అన్నారు. టాటాను అతి త్వరలో ఎయిర్ ఇండియా ను అప్పగించేస్తాం అన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: