స్విగ్గీ, జోమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తారా... అయితే ఇక నుంచి జిఎస్టీ కట్టాల్సిందే...?

Sahithya
ఆన్లైన్ లో ఫుడ్ డెలివరి విషయంలో నగరాల్లో ప్రజలు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. చాలా వరకు కూడా ఇంట్లో వండటం కష్టమై, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాల్లో బిజీగా ఉంటూ వాటి మీద ఆధారపడుతున్నారు. అయితే తరుచుగా ఈ యాప్స్ లో ఆర్డర్ లు చేసే వారికి కచ్చితంగా షాక్ తగలవచ్చు అని అంటున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌ల నుండి తరచుగా ఆర్డర్ చేసే వ్యక్తులకు త్వరలో షాక్ తగిలే అవకాశం ఉంది. యాప్ ఆధారిత ఇ-కామర్స్ ఆపరేటర్లు అందించే ఆహార పంపిణీ సేవలపై త్వరలో వస్తువులు మరియు సేవల పన్నుని విధించే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 17 న జరగబోయే కౌన్సిల్ సమావేశంలో, సమావేశంలో చర్చించాల్సిన ప్రతిపాదనలలో ఒకటి గా ఉంది. స్విగ్గి మరియు జోమాటో వంటి సంస్థలు అందించే రెస్టారెంట్ డెలివరీ సేవలపై జీఎస్టీ విధించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కౌన్సిల్ కి సంబంధించి ఫిట్మెంట్ కమిటీ ఈ సూచనలు చేసింది. క్లౌడ్ కిచెన్స్/సెంట్రల్ కిచెన్స్ ద్వారా ఆహారం అందించడం, డోర్ డెలివరీ మరియు టేక్అవే అలాగే రెస్టారెంట్ సర్వీస్ కింద వసూళ్లు చేయాలని కమిటీ పేర్కొంది. ఈ కమిటీ రెండు ఆప్షన్స్ ఇచ్చింది.
మొదటిది సంస్థలను "డీమ్డ్ సప్లయర్స్" గా రెండు కేటగిరీల కింద ప్రకటిస్తారు. రెస్టారెంట్ నుండి సంస్థ వరకు 5 శాతం పన్ను రేటుతో ఇన్‌పుట్ క్రెడిట్ లేకుండా మరియు 18 శాతం ఇన్‌పుట్ క్రెడిట్‌ వరకు... సంస్థ నుండి కస్టమర్‌కు 5 శాతం వరకు వసూలు చేస్తారు. రూ .7,500 కంటే ఎక్కువ టారిఫ్‌లు ఉన్న హోటళ్లలోని రెస్టారెంట్‌లకు ఇది వర్తించకపోవచ్చు. సర్వీస్ ప్రొవైడర్లు రిజిస్టర్ చేసుకోవడానికి రూ. 20 లక్షల బేస్ లిమిట్ ఉన్నందున, అన్ని రెస్టారెంట్ సేవలను 'అగ్రిగేటర్' మరియు సంస్థల కింద కేటగిరీలతో డెలివరీ సర్వీసుల అగ్రిగేటర్‌లుగా చేర్చాలనే ప్రతిపాదన ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: