సెప్టెంబర్ 1 నుంచి మారనున్న ఆ బ్యాంక్ రూల్స్...?

Suma Kallamadi
సైబర్ నేరాలు పెరిగిపోవడం వల్ల ఆయా బ్యాంకులు అప్రమత్తమయ్యాయి. ఆర్బీఐ కూడా సైబర్ నేరాల అదుపుకు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా బ్యాంకు ఖాతాదారుల సేఫ్టి విషయంలో ఆర్బీఐ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఉంటుంది. బ్యాంకులు కూడా తమ కస్టమర్ల భద్రత విషయంలో ఎప్పటికప్పుడు తమ రూల్స్ ను మారుస్తూ ఉంటాయి. తాజాగా యాక్సిస్ బ్యాంకు కూడా తమ రూల్స్ ను మార్చింది. మీరు కనుక యాక్సిన్ బ్యాంకు కస్టమర్ అయితే మీకో శుభవార్త. చెక్ బుక్ మోసాలు ఎప్పటికప్పుడు పెరిగిపోవడంతో ఆ మోసాలు జరగకుండా ఉండేందుకు ఆర్బీఐ పాజిటివ్ పేమెంట్ విధానాలను తీసుకొచ్చింది.
ఈ విధానాలను ఆయా బ్యాంకులు అమలు చేస్తూ వస్తున్నాయి. తాజాగా యాక్సిస్ బ్యాంకు కూడా చెక్ బుక్ మోసాలను అరికట్టేందుకు పాజిటివ్ పేమెంట్ విధానాన్ని సెప్టెంబర్ 1వ తేది 2021 నుంచి అమలు చేయనుంది.బ్యాంకింగ్ రంగంలో మోసాలను అరికట్టడానికి ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 1వ తేదీ 2021వ సంవత్సరంలో ఆర్బీఐ పాజిటివ్ పే విదానాన్ని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో బ్యాంకులకు ఆర్బీఐ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే 2020లోనే చెక్ కోసం ఆర్బీఐ పాజిటివ్ పే సిస్టమ్ ను తీసుకురావాలని చూసింది కానీ అది కుదరలేదు. కరోనా వల్ల అన్నీ తారుమారు అయ్యాయి.
 భారీ మొత్తంలో చెల్లింపులు చేయడానికి కొన్ని ముఖ్యమైన కీలక వివరాలు రీ-కన్ఫర్మేషన్ అవసరం అవుతుంది. అందుకే ఈ విధానాన్ని ఆర్బీఐ రూపొందించింది. కానీ రూ.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న క్లియరింగ్‌ కి బ్యాంకులకు తప్పనిసరిగా ఖాతాదారుడికి సమాచారం అందిస్తాయి. ఈ నేపథ్యంలో ఎస్ఎంఎస్ హెచ్చరికల ద్వారా, బ్రాంచ్‌లు, ఏటీఎంలతో పాటు వెబ్‌సైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పాజిటివ్ పే సిస్టమ్‌ గురించి కస్టమర్లకు తెలియజేయాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. ఆర్బీఐ తీసుకున్న ఈనిర్ణయం వల్ల చెక్ బుక్ మోసాలనేవి జరగవని స్పష్టంగా అర్థమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: