ఒక్క 'సిప్' తో కోట్లు సంపాదించండిలా ?

VAMSI
నేడు సమాజంలో ప్రతి ఒక్కటీ ఎంతో ఖర్చుతో కూడుకున్నవిగా ఉన్నాయి. తద్వారా మనము చిన్న చిన్న ఆర్ధిక పరమైన అవసరాలను తీర్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఎల్లప్పుడూ భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా ఉండడానికి మరియు మనకు అనుకోకుండా వచ్చే ఆర్ధిక అవసరాలను తీర్చుకోవడానికి ఒక ప్లాన్ ప్రకారం డబ్బును పొదుపు చేసుకుంటూ ఉండాలి. అదే మనకు శ్రీరామరక్షగా ఉంటుంది. ఇప్పుడు వ్యాపార రంగంలో అనేక మార్గాలున్నప్పటికీ కొన్ని సులభమైన మరియు ఒత్తిడి లేని పద్దతులపై ప్రజలంతా మక్కువ చూపిస్తున్నారు. అందరికీ మ్యూచువల్ ఫండ్స్ గురించి అవగాహన ఉండే ఉంటుంది, ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఒక పద్ధతి ప్రకారం పెట్టుబడులు పెడితే 10 కోట్ల రూపాయలు సంపాదించవచ్చని తెలుస్తోంది. వారి అదెలాగో ఒకసారి చూద్దాం.
మ్యూచువల్ ఫండ్స్ లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో ఒక పద్ధతి ప్రకారం పెట్టుబడులు పెడితే మీకు భవిష్యత్తులో కోట్ల లాభాలను తెచ్చిపెడతాయని వ్యాపార నిపుణులు చెబుతున్నారు. ఇందులో రాబడి శాతం 12 గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా 25 సంవత్సరాల పాటుగా పెట్టుబడులు పెడితే మీరు జీవితంలో మీకు ఫైనాన్సియల్ సేఫ్టీ ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే మీరు ఈ సిప్ పద్దతిలో ఎక్కువ మొత్తంలో ఒకే సారి డబ్బును పొదుపు చేయాల్సిన అవసరం లేదు. మీదగ్గర ఉన్న అమౌంట్ ను సిప్ లో పొదుపు చేస్తే, మీ టెన్యూర్ పూర్తయ్యేలోపు ఎక్కువ మొత్తంలోనే లాభాన్ని గడించవచ్చని చెబుతున్నారు.  
అంతే కాకుండా మీరెంతయితే మొదటిగా కట్టారో, పోయే కొద్దీ మీ ఆదాయానికి తగినట్లుగా డిపాజిట్ అమౌంట్ ను పెంచుకుంటూ పోతే, వడ్డీ అధికంగా పొందడానికి వీలుగా ఉంటుంది. ఇది ముఖ్యంగా ఎంప్లాయిస్ మరియు కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి ఒక సువర్ణావకాశంగా చెప్పొచ్చు. అయితే ఈ సిప్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మీకు దగ్గర్లోని మ్యూచువల్ ఫండ్స్ ఆఫీస్ కు వెళ్లి కలవండి. అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: