మహిళలకు గుడ్ న్యూస్... భారీగా పడిపోయిన బంగారం ధరలు?

Veldandi Saikiran
బంగారం... ప్రపంచం లోనే అత్యంత విలువైన వస్తువు. బంగారాన్ని కొనడానికి చాలా మంది ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా మనదేశంలో ఎంత ధనం వున్నా ఉండని.... బంగారాన్ని కొనేస్తారు మహిళలు. బంగారం కొన్ని సంప్రదాయం మన భారతదేశంలో మొదటి నుంచి ఉంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది బంగారం కొనుగోలు చేస్తారు. అంతా బానే ఉంది కానీ బంగారం ధరలు మాత్రం రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభించిన అప్పటి నుంచి పసిడి ధరల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎగిసిపడుతున్నాయి బంగారం ధరలు.


 గత ఏడాది అయితే 60 వేలకు చేరువలో నమోదయింది బంగారం ధర.  ఇదే ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టడంతో 50 వేల లోపు నమోదైన అప్పటికీ రోజురోజుకు ధర పెరుగుతూ తగ్గుతూ వస్తుంది. బంగారం ధరల్లో నిలకడ లేకుండా పోతుంది. నుంచి భారీగా పెరిగిన బంగారం ధరలు తాజాగా పడిపోయాయి. హైదరాబాదులో బంగారం ధరల విషయానికి వస్తే.... 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 250 రూపాయలు పడిపోయి... రూ. 45,000 లకు చేరుకుంది. 


అలాగే 24 క్యారెట్ల బంగారం ధర మూడు వందల అరవై రూపాయలు పడిపోయి.... రూ.49,010 కు చేరుకుంది. దీంతో బంగారం కొనుగోలు చేసే వారికి వారి ఊరట లభించింది. బంగారం ధరలు భారీగా తగ్గగా వెండి ధరలు కూడా అదే బాట పట్టాయి. ఇవాళ కిలో వెండి ధర ఏకంగా 11 వందల రూపాయలు పడిపోయి.... రూ.73,200 కు చేరుకుంది.ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే.... ఢిల్లీలోనూ బంగారం ధరలు భారీగా పడిపోయాయి. 22 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయలు పడిపోయి రూ. 47150 కి చేరుకోగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 260 రూపాయలు పడిపోయి రూ. 51,440 కి చేరింది. దీంతో మహిళలకు ఊరట కలిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: