కోకాాపేటలో రికార్డు ధర

Podili Ravindranath
హైదరాబాద్ లో భూమి విలువ ఎలా ఉందో మరోసారి రుజువైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా తీసుకున్న భూముల వేలం ప్రక్రియ రికార్డులు సృష్టిస్తోంది. కోకాపేట భూముల వేలం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎకరం భూమి ఏకంగా రూ.45 కోట్లు పలికింది. కోకాపేటలో మొత్తం 449.20 ఎకరాల భూమికి ఆన్ లైన్ లో తెలంగాణ ప్రభుత్వం వేలం నిర్వహించింది. ఎంఎస్ టీసీ వెబ్ సైట్ ద్వారా ప్రభుత్వ భూములను వేలం వేసింది కేసీఆర్ సర్కార్. దీని ద్వారా ప్రభుత్వానికి సుమారు 20 వేల 210 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇది జీహెచ్ఎంసీలోనే ఓ రికార్డు.


ఎంతో కాలంగా ఖాళీగా ఉన్న తెలంగాణ ఖజానా కాసులతో నిండిపోయింది. కోకాపేట భూముల వేలంలో రికార్డు స్థాయి ధర పలికింది. ముందుగా ఊహించిన దానికంటే రెట్టింపు ధరను ఈ కోట్ చేశారు బిల్డర్లు. ఈ ధరతోనే హైదరాబాద్ లో రియల్ ఎస్టేటే వ్యాపారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచు. గజం భూమి దొరికితే చాలు అనుకునే పరిస్థితి కూడా ప్రస్తుతం హైదరాబాద్ లో నెలకొంది.
రేపు ఖానామెట్ లోని 15.01 ఎకరాల భూమికి ఆన్ లైన్ లో వేలం నిర్వహించనుంది తెలంగాణ సర్కార్. ప్రస్తుతం ఖానామెట్ లో ఎకరాని కనీస ధరను రూ.25 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈ ధర కూడా రెట్టింపు వచ్చేలా ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే... మరో రూ.750 కోట్లు ఖజానాకు జమయ్యే ఛాన్స్ ఉంది. కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు భూముల వేలం కొంత ఊరట ఇచ్చిందనే చెప్పాలి. ఇక ఈ వేలంతో పాటు ఇక్కడ జరిగే వ్యాపారం వల్ల కూడా ఖజానాకు మరింత లాభం జరిగనుంది.దీంతో హైదరాబాద్ లోని కోకాపేట ప్రాంతం మరోసారి తెలంగాణ ప్రభుత్వానికి బంగారు గనిలా రుజువు చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: