బిజినెస్: వీటితో వ్యాపారం మొదలు పెడితే.. అదిరిపోయే లాభాలు మీ సొంతం.
కరోనా వచ్చిన తర్వాత చాలా మంది తమ ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం, బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇంట్లో ఉంటే మరి ఆర్థికంగా ఎలా జీవనం గడపాలి.. పనులు లేని కారణంగా ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందుకోసమే చాలామంది వ్యాపారాలు మొదలుపెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇలాంటి విపత్కర పరిస్థితులలో చాలామంది ఉద్యోగం చేయడం కంటే, ఏదైనా వ్యాపారం చేయడం మేలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికోసం ఒక చక్కని బిజినెస్ మీ ముందుకు తీసుకొస్తున్నాము. దీని ద్వారా మీరు ఆదాయం ఎక్కువగా పొందవచ్చు. అయితే బిజినెస్ ఏమిటో దాని గురించి పూర్తి విషయాలను తెలుసుకుందాం..
ఇటీవల కాలంలో చాలా మంది ఫుడ్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అందులో ఫాస్ట్ ఫుడ్ కి ఉన్నంత క్రేజ్ మరెక్కడా లేదు. ఎక్కువగా రోడ్ సైడ్ దొరికే పానీపూరి, గోబీ , మంచూరియా, నూడిల్స్, పిజ్జా, బర్గర్ వంటివి ఎక్కువగా తినడానికి ఇష్టపడుతున్నారు. ఇక నాటి కాలంతో పోల్చుకుంటే, ఇటీవల కాలంలో యువత తో పాటు చిన్న పిల్లలు కూడా వీటిని తినడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు.. అయితే ఇందులో మీరు నూడుల్స్ వ్యాపారం కనుక మొదలు పెట్టినట్లు అయితే, దీని ద్వారా వచ్చే లాభం అంతా ఇంతా కాదు.. దీని ద్వారా మంచి లాభాన్ని కూడా పొందవచ్చు.
ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు , షాప్స్, హోటల్స్ ఎక్కువగా కొనుగోలు చేస్తారు. కాబట్టి నూడుల్స్ తయారు చేసే విధానాన్ని మొదలుపెట్టవచ్చు. ఈ నూడిల్స్ తయారీకి కావలసినవి గోధుమ పిండి, స్టార్చ్, పంచదార, ఉప్పు , సోడియం బై కార్బనేట్ , మసాలా సామాన్లు, నూనె అవసరం అవుతాయి. ఇక వీటన్నింటిని మీరు హోల్ సేల్ షాప్ లలో తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇక ఇప్పుడు ఈ నూడుల్స్ ను తయారు చేయడానికి మార్కెట్లో ఎన్నో రకాల యంత్రాలు కూడా లభ్యమవుతున్నాయి.
ఒకవేళ మీరు మిషన్ కొనుగోలు చేయాలనుకువారు రూ.40 వేలు ఈ మిషన్ ధర ఉంటుంది. ఇక ఈ మిషన్ ద్వారా మీరు మీకు కావలసిన సైజులో నూడిల్స్ ను తయారు చేయవచ్చు. ఇక దీని ద్వారా మీరు నూడుల్స్ తయారు చేసి, షాపులకు పంపడం ద్వారా ఇంట్లో ఉంటూనే, ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా ముద్ర లోన్ కింద 50 నుంచి 10లక్షల రూపాయల వరకు లోన్ ఇస్తోంది. కాబట్టి ఎటువంటి భయం లేకుండా ఈజీగా ఈ వ్యాపారం మొదలుపెట్టి లాభాలను ఆర్జించవచ్చు.