ఒకటి కన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇవి ఒకసారి చూడండి..

Satvika
ఈ మధ్య డబ్బులు దాచుకునేందుకు చాలా మంది ఒక వివిధ బ్యాంకుల్లో డబ్బులను దాచుకుంటారు. బ్యాంకులు కూడా వినియోగదారులను పెంచుకునేందుకు కొత్త ఆఫర్లను కూడా అందిస్తూ వస్తుంది.బ్యాంకులు ఎన్నో రకాల సర్వీసులు అందిస్తున్నాయి. రుణాలు, మనీ ట్రాన్స్‌ఫర్, సేవింగ్స్ ఇలా పలు రకాల బెనిఫిట్స్ పొందొచ్చు. మీరు బ్యాంక్ నుంచి ఏమైనా సర్వీసులు పొందాలని భావిస్తే.. కచ్చితంగా బ్యాంక్ ఖాతా ఉండాల్సిందే. రుణాలు, క్రెడిట్ కార్డులను తీసుకుంటారు.

ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ అకౌంట్ సరిపోతుంది. అయితే చాలా మందికి ఒకటి కన్నా ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు ఉండొచ్చు. ఇలా ఒకటి కన్నా ఎక్కువ బ్యాంక్ ఖాతాలు కలిగి ఉంటే పలు రకాల నష్టాలు ఎదుర్కోవలసి వస్తుందని అంటున్నారు. ఎటువంటి నష్టాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..వరల్డ్ బ్యాంక్ 2017 నివేదిక ప్రకారం చూస్తే.. దేశంలోని సగం మంది జనాభాలో ప్రతి ఒక్కరూ ఇన్‌యాక్టివ్ అకౌంట్‌ను కలిగి ఉన్నారు. కొంత మందికి ఇంకా ఎక్కువ ఖాతాలే ఉన్నాయి. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఒకటి కన్నా ఎక్కువ అకౌంట్లు కలిగి ఉండటం వల్ల మినిమమ్ బ్యాలెన్స్ దగ్గర సమస్యలు వస్తాయి..

మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు చార్జీలు వేస్తాయి. అదే మీరు బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు పెడితే మీకు 3 శాతం వరకు వడ్డీ వస్తుంది. అదే మీ డబ్బులను మ్యూచువల్ ఫండ్స్, సేవింగ్స్ స్కీమ్స్‌లో పెడితే అధిక రాబడి పొందొచ్చు. ఇంకా ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఎక్కువ ఖాతాలు ఉంటే మోసగాళ్ల బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు ఆయా బ్యాంకులకు సంబంధించిన  డెబిట్ కార్డుల కు చార్జీలను కూడా చెల్లించాలి.బ్యాంకులకు పలు రకాల చార్జీలు వసూలు చేస్తాయి. ఇంకా ట్యాక్స్ అధికారులకు కూడా మీరు అన్ని బ్యాంకుల వివరాలు తెలియజేయాలి..ఎక్కువ బ్యాంకులు ఉంటే పిన్ నంబర్లు కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది.. అందుకే ఒకటి, రెండు బ్యాంకులు ఉంటే సరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: