ఓటీపీ ఫార్మాట్ మార్చేయనున్న ట్రాయ్.. ఇకపై సైబర్ నేరాలకు చెక్ పడ్డట్లేనా..
2020, ఫిబ్రవరి నెలలో తమ కొత్త సాఫ్ట్ వేర్ ని అప్ డేట్ చేసుకుంటేనే.. ఓటీపీలు పంపిస్తామని బ్యాంకు సంస్థలపై ట్రాయ్ ఒత్తిడి తెచ్చింది. 24 గంటల పాటు ఓటీపీలు పంపించడం కూడా నిలిపివేసింది. ఐతే బ్యాంకు సంస్థలు తమకు కొంచెం గడువు ఇవ్వాలని కోరడంతో ట్రాయ్ అంగీకరించింది. ఆ విధంగా ఏడాది గడుస్తున్నా బ్యాంకులు కొత్త ఫార్మాట్ ని అప్ డేట్ చేసుకోవడం లేదు. దీనితో ట్రాయ్ ఏప్రిల్ 1 లోపు అప్డేట్ చేసుకోవాలని లేకపోతే అప్ డేట్ చేసుకునేంత వరకూ SMS, OTP సేవలు నిలిపివేస్తామని హెచ్చరిస్తోంది. ఒకవేళ బ్యాంకులు ఏప్రిల్ 1 నాటికి కూడా చెల్లింపులకు సంబంధించి కొత్త ఫార్మాట్ అప్ డేట్ చేసుకోకపోతే వినియోగదారులకు ఇబ్బందులు తప్పవు.
అయితే సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకే ఈ సరికొత్త ఫార్మాట్ అందుబాటులోకి తెస్తున్నట్లు ట్రాయ్ సంస్థ చెబుతోంది. ఇందులోని భాగంగానే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆటోమేటిక్ గా జరిగే చెల్లింపు విధానం లో కొన్ని కీలక మార్పులు తీసుకొస్తోంది. వినియోగదారులకు ప్రతి నెల హౌస్ లోన్ నుంచి టెలిఫోన్ బిల్లు వరకు ఆటోమేటిక్ గా బిల్ అమౌంట్ కట్ అయ్యేవిధంగా స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు. కానీ ఇకపై వేటికి పడితే వాటికి ఆటోమేటిక్ గా చెల్లింపులు కుదరవట. అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ తదితర డిజిటల్ సేవలతో పాటు మిగిలిన వాటన్నిటికీ కూడా ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఆటోమేటిక్ పేమెంట్ లకు చెక్ పడుతుంది.