రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బైకే... కానీ అది కాదు‌

Garikapati Rajesh
చైనా వస్తువు అంటేనే న‌కిలీ వ‌స్తువు అనే పేరు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌డిపోయింది. ప్రతి ఉత్పత్తికి న‌కిలీ ఉత్పత్తిని తయారు చేయటంలో సిద్ధహస్తులు. ఇప్పటికే ప‌లు అంతర్జాతీయ ఉత్పత్తులను కాపీ కొట్టిన చైనా కంపెనీలు మనదేశంలో అత్యంత పేరెన్నిక‌గ‌న్న రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్‌ను కాపీకొ్ట్టారు. అడ్వెంచర్ మోటార్ సైకిల్ హిమాలయన్స ను పోలివుండేలా ఒక మోటార్ సైకిల్‌ను చైనా కంపెనీ త‌యారుచేసి మార్కెట్‌లోకి విడుద‌ల చేయ‌బోతోంది. దానిపేరు 'హాన్వే జి30'.
అడ్వెంచ‌ర్ టూర్ మోటార్ సైకిల్‌
హాన్వే జి30 మోటార్ సైకిల్ చూడటానికి మనదేశంలో లభిస్తున్న రాయల్  ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటార్ సైకిల్ లాగే ఉంటుంది. దీని బేసిక్ డిజైన్, ఫ్రేమ్, హెడ్ లైట్‌, స్ప్లిట్ సీట్,  విండ్‌షీల్డ్‌, సైలెన్సర్, స్పోక్ వీల్స్ అన్ని డిజైన్ ఎలిమెంట్స్ హిమాలయన్ లా ఉంటాయి. ఈ మోటార్ సైకిల్‌ను చైనీస్ టచ్ ఇచ్చేందుకు కంపెనీ దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ను పూర్తిగా ఎల్‌సీడీతో చేసింది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కింది భాగంలో మొబైల్ చార్జింగ్ కోసం 5 వోల్ట్ సాకెట్‌ను కూడా జోడించింది. హాన్వే జి30 ఒక 250సీసీ అడ్వెంచర్ టూర్ మోటార్ సైకిల్‌.
రూ.1.92 ల‌క్ష‌లు
చైనాకి చెందిన హాన్వే సంస్థ ఈ మోడల్‌ను జి30 స్టాండర్డ్, జి30-ఎక్స్ అనే రెండు వేరియంట్లలో విక్రయించనుంది. జి30 ఎక్స్ మోడల్లో కంపెనీ ట్యూబ్లెస్ టైర్లతో వైర్స్పోక్ అల్లాయ్ వీల్స్, రెండువైపులా పన్నీర్స్,  టీఎప్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లను అందిస్తోంది. చైనా మార్కెట్లో దీని ధర 17,280 యెన్లుగా ఉంది. మన కరెన్సీలో రూ.1.92 లక్షలు. హాన్వే జి30 మోటార్ సైకిల్‌లో  249.2 సిసిలో సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 9000 ఆర్పీఎమ్ వద్ద 26 బిహెచ్‌పీ శక్తిని, 7000 ఆర్పిఎమ్ వద్ద 22 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. గంటకు 128 కిమీ వేగంతో ప‌రుగులు తీస్తుంద‌ని, లీట‌రుకు 32.2 కిలోమీట‌ర్ల మైలేజీని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: