కేవలం చెప్పులు వేసుకుంటే చాలు లక్షల్లో జీతం!

Divya

నిరుద్యోగ సమస్య  నిరుద్యోగులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఇక చాలా మంది నిరుద్యోగులు జాబ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అప్పటికీ  జాబ్ దొరకక ఎంతో మంది నిరుద్యోగులు చెప్పులరిగేలా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు ఇదేంటి చెప్పులు వేసుకుంటే చాలు లక్షల్లో జీతం ఇస్తాం అంటున్నారు?అని షాక్కు గురవుతున్నారు. అవునండి.. కేవలం చెప్పులు వేసుకుంటే చాలు వారు లక్షల్లో జీతం ఇస్తారు. దాని పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం
పూర్తి వివరాల్లోకి వెళితే బెడ్ రూమ్ అథ్లెటిక్స్ అనే సంస్థ ఈ ఉద్యోగాలను కల్పిస్తోంది. 2021లో ఓ మహిళ, ఓ పురుషుడిని అపాయింట్మెంట్ చేసుకునేందుకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అయితే ఆ సంస్థ తయారు చేసే లేటెస్ట్ ఫుట్ వేర్ ను టెస్టర్ గా పని చేయాలి అంతే.  అందుకోసం రోజుకు పన్నెండు గంటలపాటు పని చేయాల్సి ఉంటుంది. బెడ్ రూమ్ అథ్లెటిక్ సంస్థ తయారు చేసే సరి కొత్త మోడల్స్ ను మీ పాదాలకు వేసుకొని, ఆ చెప్పులు కస్టమర్లకు నచ్చుతాయా, లేదా,కంఫర్టబుల్గా ఉంటాయా అని టెస్ట్ చేయాలంతే . ఇందుకోసం ఆ జాబ్ లో జాయిన్ అయిన వారికి బెడ్ రూమ్ అథ్లెటిక్స్ సంస్థ సంవత్సరానికి నాలుగు లక్షల రూపాయలు ఇవ్వనుంది.
అంతేకాకుండా జాబుకు ఎంపికైతే 12 జతల చెప్పులతో పాటు 12 నెలల కాంట్రాక్ట్ కూడా దక్కుతుంది. ఈ జాబ్ కు సంబంధించిన అన్ని డీటెయిల్స్ బెడ్రూమ్ అథ్లెటిక్ సంస్థ తమ వెబ్సైట్లో ఉంచింది. ఇక బెడ్ రూమ్ అథ్లెటిక్స్ సంస్థ తన వెబ్సైట్లో అభ్యర్థుల కోసం " జాబ్స్ లో ఇది సిండ్రెల్లా లాంటిది. ఇద్దరు ఉద్యోగుల కోసం చూస్తున్నాము.అందులో ఓ మహిళ, ఓ పురుషుడి నియమించుకోవాలి అనుకుంటున్నాము". నెలలో రెండు రోజులు అందుబాటులో ఉంటే  333 యూరోల జీతం ఇస్తారు.మేము తయారు చేసే స్లిప్పర్లు, స్లిప్పెర్స్ బూట్లు, లాంగ్ వేర్లు,హోం వేర్లు, టెస్ట్  చేస్తే చాలు అని ప్రకటించింది.
ఇక బెడ్ రూమ్ అథ్లెటిక్ సంస్థ డైరెక్టర్ హోవర్డ్ వెట్టర్  మాట్లాడుతూ.. "అఫీషియల్ గా టెస్టర్ లు ఉండడం ఎంతో ముఖ్యం. మా స్లిప్పర్స్ ను  ఇంకా ఎంత మెరుగుపరచాలో, కొత్త విధానంలో ఎలా మెరుగుపరచాలో  అనే విషయంపై వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటాం. ఎవరి పాదాలు తొందరగా చల్ల బడతాయో వారే ఈ జాబ్ కు మరింత సూట్ అవుతారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: