తొలిసారి తాత అయిన సంతోషంలో ముఖేశ్ అంబానీ
‘‘శ్రీకృష్ణుని దయ, ఆశీర్వాదాలతోనే మాకు శుభం జరిగింది. శ్లోక, ఆకాశ్ అంబానీ దంపతులు తల్లిదండ్రులయ్యారు. శ్లోకా నేడు (గురువారం) ముంబైలో ఓ మగ బిడ్డకు జన్మనిచ్చారు. నీతా, ముఖేశ్ అంబానీ దంపతులు మొదటిసారి తాత, నాన్నమ్మ అయిన అనుభూతిని మాటల్లో తెలియజేయలేకపోతున్నారు. వాని ఆనందానికి హద్దులు లేవు. ధీరూభాయ్, కోకిలాబెన్ దంపతుల మునిమనుమడిని స్వాగతిస్తూ నీతా, ముఖేశ్ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు’’ అని అంబానీ కుటుంబం పేర్కొంది. శ్లోకతోపాటు మగ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలపారు. మగ బిడ్డ జన్మించడంతో మెహతా, అంబానీ కుటుంబాలు చాలా సంతోషిస్తున్నట్లు తెలిపారు.
శ్లోక మెహతా, ఆకాశ్ అంబానీల వివాహం గత ఏడాది మార్చిలో జరిగింది. వీరి పెళ్లి పెద్ద పండుగలా ముంబైలో జియో వరల్డ్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. మనుమడు పుట్టిన సందర్భంగా మరో మారు అంగరంగ వైభవంగా వేడుకను జరుపుకోనున్నారని సమాచారం. మరి వారి సంతోషాన్ని ముఖేస్ అంబానీ, నీతా అంబానీలు ఎలా వ్యక్త పరుస్తారో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా అప్పుడే ఈ బిడ్డకు పెట్టబోయే పేరు గురించి కూాడా చర్చించుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.