2 లక్షల కోట్ల రూపాయలతో కేంద్రం కొత్త స్కీం రూపకల్పన!
వచ్చే ఐదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులను ఈ స్కీమ్ కింద పలు రంగాల కోసం ఖర్చు చేయనుంది. అన్ని రంగాల్లో కెల్లా వాహన రంగానికి, వాహన విడిభాగాల రంగానికి అధిక ప్రాధాన్యం లభించింది. కేంద్రంలోని మోదీ సర్కార్ ఈ రంగాల కోసం రూ. 57 వేల కోట్లు కేటాయించింది. స్కీమ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అదనంగా తయారు చేసిన ప్రొడక్టులకు రాయితీలు అందిస్తుంది. అలాగే వీటిని ఇతర దేశాలకు ఎగమతి కూడా చేయొచ్చు. అడ్వాన్స్ సెల్ కెమిస్ట్రీ బ్యాటరీ, ఫార్మాస్యూటికల్స్, ఫుడ్ ప్రొడక్షన్, వైట్ గూడ్స్, టెక్స్టైల్, టెలికం అండ్ నెట్వర్కింగ్, టెక్నాలజీ ప్రొడక్ట్స్ వంటి రంగాలకు కూడా కేటాయింపులు దక్కాయి. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం 2025 వ సంవత్సరం నాటికి 1 ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఎకానమీని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
మన దేశంలో ప్రైవేట్ రంగంలో ఇన్వెస్ట్మెంట్లను పెంచడం ముఖ్య లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ తెలిపారు. పీఎల్ఐ స్కీమ్ కింద పలు కీలకమైన రంగాలకు ఆర్థిక తోడ్పాటు లభిస్తుందని పేర్కొన్నారు. మన దేశంలోకి ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించడం కోసం ఈ ఆర్థిక మద్దుతు అందిస్తున్నామని వివరించారు. వివిధ రంగాలకు చెందిన మంత్రులు, విభాగాలు వెంటనే ఈ స్కీమ్స్‌ను అమలు చేస్తాయని తెలిపారు.