రాబోయే రోజుల్లో స్టాక్ మార్కెట్ మరింత పెరగనుందా..?

Suma Kallamadi
భారతీయ స్టాక్ మార్కెట్ల జోరు ఈ వారం కూడా కొనసాగుతుందని చాలామంది మార్కెట్ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఇకపోతే తాజాగా గత మూడు నెలల్లో ఏకంగా పది కంపెనీలు షేర్ మార్కెట్ లోకి పబ్లిష్   అయ్యాయి. దీంతో రాబోయే రోజులలో ప్రైమరీ మార్కెట్ వెలుగులోకి రాబోతోంది. ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి ఎంటర్ అవుతున్న కొత్త కంపెనీలకు స్టాక్ మార్కెట్లు జోరుమీద ఉండడంతో వారికి బాగా సహకరించినట్లు అయింది.


ఇకపోతే ఈ సంవత్సరం Q2 ఫలితాల నేపథ్యంలో ఐటి, ఫార్మా, సిమెంట్, ఆటో కెమికల్స్  పటిష్ట పనితీరు కనిపించే విధంగా కనపడుతున్నాయి. ప్రస్తుతం ప్రకటించే ఆదాయలకు సంబంధించిన వివరాలపై భవిష్యత్తులో కంపెనీలు వాటికి సంబంధించి ఇన్వెస్టర్లు దృష్టి సాధించేందుకు వీలు పడుతుంది. రాబోయేది పండుగ సీజన్ కాబట్టి మార్కెట్ మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు మార్కెట్ నిపుణులు. ఇలా కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, గ్రామీణ గృహ నిర్మాణంపై దృష్టి పెట్టడంతో మార్కెట్ లో కన్జ్యూమర్ రంగాలకు సంబంధించి భారీగా డిమాండ్ పెరగవచ్చునని కొన్ని ఏజెన్సీ సంస్థలు తెలుపుతున్నాయి.


దీంతో ఫ్యూచర్ లో మరింతగా మార్కెట్ పెరగవచ్చునని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతమున్న మార్కెట్ ఆర్థిక రికవరీ సూచించడం, అలాగే ప్రభుత్వం తీసుకున్న అన్ లాక్ ప్రక్రియ ద్వారా పలు నిబంధనలను తొలగించడంతో మార్కెట్లు మరింత దూసుకుపోయే సూచనలు కనబడుతున్నాయి. ప్రస్తుతం ఇంకా కరోనా వైరస్ కు సంబంధించి వ్యాక్సిన్ ఆలస్యం అవుతుండటంతో.. మరోవైపు అమెరికా ప్రభుత్వం సహాయక ప్యాకేజీ పై వెనుకడుగు వేయడం ద్వారా మార్కెట్లు పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి మార్కెట్ నిపుణులు ఏ విధంగా మొగ్గుచూపుతారో. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో కాస్త ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: