రూ.2 వేల నోట్లపై మోదీ సర్కార్ కీలక నిర్ణయం..!
అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల నోట్లపై కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం. అంతేకాకుండా రూ.2,000 నోట్ల ప్రింటింగ్‌ను నిలిపివేసే ఆలోచన లేదని తెలియజేసింది. అందుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొన్నారు. ఆర్థిక శాఖ శనివారం లోక్ సభలో ఈ విషయాన్ని తెలియజేసింది.
ఇక ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ రూ.2,000 నోట్ల ప్రింటింగ్‌కు సంబంధించిన ప్రశ్నకు లోక్ సభలో లిఖిత పూర్వ సమాధానం ఇచ్చారు. కరెన్సీ నోట్ల ప్రింటింగ్ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)తో సంప్రదింపులు జరిపి తర్వాతనే ఏ నిర్ణయమైనా తీసుకుంటుందని వివరించారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా అన్ని రకాల కరెన్సీ నోట్లు అందుబాటులో ఉండేలా చూసుకుంటుందని తెలిపారు.
అంతేకాకుండా 2020 మార్చి 31 నాటికి 27,398 లక్షల రూ.2 వేల నోట్లు చెలామణిలో ఉన్నాయని తెలిపింది. అయితే 2019 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లు 32,910 లక్షలుగా ఉన్నాయని తెలిపారు. ఇక కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ విధింపు కారణంగా రిజర్వు బ్యాంక్ ప్రస్తుతానికి కరెన్సీ నోట్లను ముద్రించడం లేదని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. అయితే ఇది తాత్కాలికమే అని పేర్కొన్నారు. ఇకపోతే రూ.2 వేల నోట్ల ముద్రణపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చిన నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఫేక్ వార్తలను నమ్మవద్దుని తెలిపారు.