ఐఆర్‌సీటీసీ ఏజెంట్ కావాలను కుంటే ఇలా చేయండి..

frame ఐఆర్‌సీటీసీ ఏజెంట్ కావాలను కుంటే ఇలా చేయండి..

Suma Kallamadi

ఐఆర్‌సీటీసీ ఏజెంట్ అవ్వడం ఎలా అని ఆలోచిస్తున్నారా? ఐఆర్‌సీటీసీ అధికారిక ఏజెంట్‌గా మారాలంటే ప్రిన్సిపల్ సర్వీస్ ప్రొవైడర్స్ ను సంప్రదించాలి. ఐఆర్‌సీటీసీ ఆథరైజ్డ్ ప్రిన్సిపాల్  సర్వీస్ ప్రొవైడర్  అని వెబ్ బ్రౌజర్ లో టైప్ చేసి సెర్చ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సెర్చ రిజల్ట్ మనకి వస్తాయి. ఇందులో తొలి దానిపై క్లిక్ చేసి ఐఆర్‌సీటీసీ ప్రిన్సిపల్ సర్వీస్ ప్రొవైడర్స్ వివరాలు మనకు లభిస్తాయి. లేదనుకుంటే ఇరైల్ వంటి థర్డ్ పార్టీ వెబ్ సైట్స్ కూడా ఏజెంట్ సర్వీసులు ఇవ్వడం జరుగుతుంది.

 

ఇక్కడ రెండు రకాల బుకింగ్ ఏజెన్సీ ఆప్షన్లు ఉన్నాయి. తొలి ప్లాలో వన్ ఇయర్ ఏజెన్సీ చార్జీలు ఉండడం జరుగుతుంది. దీని కోసం రూ.3,999 మనము చెల్లించవలసి ఉంటుంది. రెండో ప్లాన్ విషయానికి వస్తే.. టూ ఇయర్ ఏజెన్సీ చార్జీలు ఉంటాయి. దీని కోసం  రూ.6,999  చెల్లించవలసి ఉంటుంది. అందువల్ల మీకు నచ్చిన ప్లానన్ను మీరు ఎంపిక కూడా సులువుగా ఎంచుకోవచ్చు.

 

ఇక  ఏజెంట్ కు కమిషన్ ఇలా ఒక టికెట్ పై రూ.10 చార్జీ చెల్లించాలి. తొలి 100 టికెట్లకు ఇది వర్తించడం జరుగుతుంది. అదే 101 నుంచి 300 టికెట్ల వరకు టికెట్‌కు రూ.8 చార్జీ చెల్లించవలసి ఉంటుంది. 300కు పైన టికెట్లను బుక్ చేస్తే టికెట్ కు రూ.5 చార్జీ చెల్లిస్తే చాలు. నాన్ ఏసీ క్లాస్ టికెట్లకు ఒక టికెట్ పై రూ.20 కమిషన్ కూడా ఏజెంట్ కు లభిస్తుంది. అదే ఏసీ టికెట్ పై రూ.40 కమిషన్ ఏజెంట్ కు లభించడం జరుగుతుంది.

ఇలా ఐఆర్‌సీటీసీ  ఏజెంట్ గా అవ్వాలనుకుంటే ఈ   డాక్యుమెంట్లు కచ్చితంగా కావాలి.  డాక్యుమెంట్ వివరాలు ఇలా..  పాన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, ఈమెయిర్ ఐడీ, ఫోటో, అడ్రస్ పూఫ్ ఉంటే చాలు సులువుగా ఏజెంట్ గా  మారిపోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: