భారీగా దిగొచ్చిన వెండి ధర.. మరి బంగారం ?

Durga Writes

బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. ఒక రోజు బంగారం ధరలు భారీగా తగ్గితే మరో రోజు బంగారం ధరలు భారీగా పెరుగుతాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో నేడు మంగళవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 20 రూపాయిల పెరుగుదలతో 39,700 రూపాయలకు చేరింది. 

 

అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 20 రూపాయిల పెరుగుదలతో 36,390 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు పడిపోగా వెండి ధర భారీగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్ లో కేజీ వెండి ధర 100 రూపాయిలు తగ్గుదలతో 47,800 రూపాయలకు చేరింది. అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ పెరగటంతో బంగారంపై ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

 

కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె  కొనసాగుతున్నాయి. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశావహ దృక్పథం కారణంగా బంగారం, వెండి తగ్గుతూ వస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. వాల్‌స్ట్రీట్‌ సరికొత్త గరిష్ఠ స్థాయిలు నమోదు చేయడం కూడా ఇన్వెస్టర్లను బంగారం పెట్టుబడులకు దూరం చేసింది రాబోయే రోజుల్లో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 

 

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.27 శాతం తగ్గుదలతో 1,466.75 డాలర్లకు క్షిణించగా అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.55 శాతం తగ్గుదలతో 17.05 డాలర్లకు దిగొచ్చింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి చేరిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: