మద్యం దుకాణాల టెండర్‌ నోటిఫికేషన్‌....దరఖాస్తులు ఎక్కడ ఇవ్వాలో తెలుసా?

Sirini Sita
రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాల నిర్వహణకు ఈ నెల 9న టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ మేరకు జిల్లా ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ అధికారి గణేష్‌, మేడ్చల్‌, బాలానగర్‌, కుత్బుల్లాపూర్‌ ఎస్‌హెచ్‌వోలతో సోమవారం సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా మద్యం పాలసీ వివరాలను వెల్లడించారు.  జిల్లాలో 99 మద్యం షాపులకు నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు తెలిపారు.


రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం నవంబర్‌ 1న కొత్త మద్యం దుకాణాల నిర్వహణకు ఈ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు.జనాభా ప్రాతిపదికన లైసెన్స్‌ ఫీజులను ఖరారు చేసిందన్నారు దీని ప్రకారం ఈ నెల 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 16వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు చెప్పారు13వ తేదీ ఆదివారం దరఖాస్తులు తీసుకోరు.

బండ్లగూడ ఆనంద్‌నగర్‌ కాలనీలోని అనంతుల రామిరెడ్డి గార్డెన్స్‌లో దుకాణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని, 18న జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి అధ్యక్షతన నిర్వహించే సమావేశంలో లాటరీ విధానం ద్వారా మద్యం దుకాణాలను కేటాయిస్తామన్నారు.దరఖాస్తుదారులు తిరిగి చెల్లించబడని (నాన్‌ రిఫండబుల్‌) ఫీజు రూ.2 లక్షల డీడీ/చలాన్‌తో పాటు 3 పాస్‌ ఫొటోలు, ఆధార్‌, పాన్‌ గుర్తింపు కార్డులతో దరఖాస్తులను సమర్పించాలని తెలియజేశారు.జిల్లా ఆబ్కారీ శాఖ కార్యాల యాలతోపాటు హైదరాబాద్, నాంపల్లిలోని ఆబ్కారీ కార్యాలయంలోని రెండో ఫ్లోర్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 18న డ్రా ద్వారా షాపులు కేటాయించనున్నారు.

ఈ నెల 30లోపు కొత్త మద్యం దుకాణాల యజమానులకు లైసెన్స్‌లు అందజేసి నవంబర్‌ 1 నుంచి కొత్త యాజమాన్యాల ఆధ్వర్యంలో మద్యం విక్రయిస్తారు.  హైదరాబాద్‌లో 94, సికింద్రాబాద్‌లో 79 చొప్పున జంటనగరాల్లో మొత్తం 173 రిటైల్‌ మద్యం దుకాణాలకుగాను లైసెన్స్‌లు జారీచేయనున్నట్టు డిప్యూటీ కమిషనర్‌ వివేకానంద రెడ్డి తెలిపారు. నూతన మద్యం పాలసీ కింద ఒక మద్యం దుకాణానికి ఏడాదికి రూ. 1.10కోట్లు లైసెన్స్‌ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని.. అలా రెండేళ్లకు కలిపి రూ 2.20 కోట్లు అవుతుందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: