శ్రీసిటీకి ఎన్‌ డి టీ వీ ప్రతిష్టాత్మక అవార్డ్‌

Shyam Mohan
 ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మక పారిశ్రామిక పార్క్‌ శ్రీసిటీకి మరో ప్రతిష్టాత్మకమైన అవార్డు దక్కింది. ఎన్‌ డి టీ వీ అనుబంధ ''ది బ్రాండ్‌ స్టోరీ'' సంస్థ వారి ''ఇండియాస్‌ మోస్ట్‌ అడ్మైరబుల్‌ బ్రాండ్‌ -2019'' అవార్డును సొంతం చేసుకుంది. 

ఈ అవార్డును ''ది బ్రాండ్‌ స్టోరీ'' సంస్థ ప్రతినిధులు శ్రీసిటీ మేనేజింగ్‌ రవీంద్ర సన్నారెడ్డికి అందచేశారు. అలాగే శ్రీసిటీ ప్రగతి పై బ్రాండ్‌ స్టోరీ సంస్థ తీసిన ప్రత్యేక కథనాన్ని ఈ నెల 2వ తేదీన ఎన్‌ డి టీ వీ ప్రాఫిట్‌ టీవీలో ప్రసారం చేశారు.

 పదేళ్ల క్రితం ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా ఈ సెజ్‌ ప్రారంభోత్సవం జరిగింది. నేడు 27 దేశాలకు చెందిన 185 కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దాదాపు 50 వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందారు. 

ఉన్నత ప్రమాణాలకే ఈ అవార్డు 

అవార్డు అందుకున్న సందర్బంగా శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి స్పందిస్తూ, ఈ అవార్డు అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. శ్రీసిటీ ఏర్పరిచిన ఉన్నత ప్రమాణాలకు ఈ అవార్డు ఓ గుర్తింపు లాంటిదన్నారు. ఇలాంటి ప్రసంశలు తమ పనితీరును, ఆవిష్కరణను గుర్తుచేయడంతో పాటు ఈ ప్రాజెక్టును మరింత ఉత్సాహంతో అభివద్ధి పరచేందుకు సహకరిస్తుందన్నారు. అవార్డుతో తమ సంస్థను గుర్తించినందుకు నిర్వాహకులకు క త్ఞతలు తెలిపారు. 

కాగా, వ్యాపార సంస్థలు సాధించిన పేరు ప్రఖ్యాతులు, ప్రభావం, ఆవిష్కరణల ఆధారంగా, ''ఇండియాస్‌ మోస్ట్‌ అడ్మైరబుల్‌ బ్రాండ్‌'' అవార్డులకు 'ది బ్రాండ్‌ స్టోరీ' సంస్థ ఎంపిక చేయడంతో పాటు, వారి కథనాన్ని ప్రాఫిట్‌ టీవీలో ప్రసారం చేస్తోంది.

కాగా, ఇప్పటికే పలు దేశీయ, అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న శ్రీసిటీ, ఇటీవలే డబ్ల్యూ సి ఆర్‌ సి ఇంటర్నేషనల్‌ వారి ఐకానిక్‌ బ్రాండ్‌ రైసింగ్‌ స్టార్‌ 2018, అసోచామ్‌ వారి జెమ్‌ సస్టెయినబిలిటీ అవార్డులను సాధించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: