లాభాల భాటలో స్టాక్ మార్కెట్లు!

Edari Rama Krishna

 నేడు దేశీయ స్టాక్‌మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభించాయి.  అమెరికా, యూరోపియన్‌ మార్కెట్ల  పాజిటివ్‌ ధోరణితో  కీలక సూచీలు రెండో రోజు కూడా ఉత్సాహంగా ముగిశాయి.  ఆరంభంనుంచి పాజిటివ్‌గా ఉన్న మార్కెట్లలో మిడ్‌ సెషన్‌ నుంచీ కొనుగోళ్లు మరింత పెరగడంతో  మదుపుదారులు ఉత్సాహంగా కొనుగోళ్లకు దిగడంతో చివరికి సెన్సెక్స్ 317 పాయింట్ల లాభంతో 35775 వద్ద, 81 పాయింట్ల లాభంతో నిఫ్టీ 10763 వద్ద ముగిశాయి. నేడు ఆర్బీఐ బోర్డు పలు విషయాలపై చర్చించడానికి ప్రభుత్వంతో సమావేశమైన నేపథ్యంలో మార్కెట్లు కొనుగోళ్లతో కళకళలాడాయి.   


నిఫ్టీ సైతం 81 పాయింట్ల లాభంతో   10,763 వద్ద స్థిరపడింది. పీఎస్‌యూ బ్యాంక్స్‌  స్వల్పంగా నష్టపోగా, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, ఆటో, ఫార్మా, ఐటీ లాభపడ్డాయి.  యస్‌ బ్యాంక్‌, ఐటీసీ, టాటా మోటార్స్‌, ఇండస్‌ఇండ్, వేదాంతా, సన్‌ ఫార్మా, ఆర్‌ఐఎల్‌, గ్రాసిమ్‌, హిందాల్కో, డాక్టర్‌ రెడ్డీస్‌ టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. 


ఇక బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియా బుల్స్, ఓఎన్జీసీ, గెయిల్ తదితర కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టాయి. మరోవైపు ఐబీ హౌసింగ్‌, గెయిల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఆటో, ఐవోసీ నష్టాల్లో ముగిసాయి.అటు  డాలరు మారకంలో రుపీ 28 పైసలు ఎగిసి 71.65 వద్ద ముగిసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: