సీయీవో గా ఫ్లిప్ కార్ట్ ఉద్యోగిని .. బంపర్ ఆఫర్
ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన ఒక సూపర్ ఆఫర్ ని ఆ సంస్థ ఉద్యోగి పద్మిని పగడాల సాధించింది .. సంస్థ పదేళ్ళ చరిత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా తన ఉద్యోగులకి ఒక్క రోజు సీయీవో గా వ్యవహరించే ఛాన్స్ కల్పించింది. దీనికోసం దేశవ్యాప్తంగా తమ సంస్థ లో పని చేస్తున్న ఉద్యోగుల నుంచి ఒక రౌ సిఈవో ని ఎంపిక చేయడం కోసం బిగ్ 10 పేరు మీద పోటీ కూడా పెట్టారు. ఇందులో భాగంగా తాము ఒకరోజు సీఈవోగా ఎందుకు పనిచేయాలనుకుంటున్నదీ రాయాల్సి ఉంటుంది. అలా రాసి పంపిన వారిలోంచి ఉత్తమంగా రాసిన వారిని ఒకరోజు సీఈవోగా ఎంపిక చేస్తారు. వందలాది మంది ఉద్యోగులు ఈ పోటీలో పాల్గొనగా బెంగళూరులో డిజైన్ విభాగంలో అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న పద్మిని పగడాల విజేతగా నిలిచారు. ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తిలానే ఆమె ఒక రోజంతా సీఈవోగా వ్యవహరిస్తారు.