ఆ ఎయిర్ పోర్ట్ లో పేలుడు
నేడు పాకిస్తాన్ మళ్లీ దాడులు మొదలు పెట్టడంతో భారత్ బ్లాక్ అవుట్ విధించింది. దాడులను అడ్డుకునేందుకు భారత్ ఆర్మీ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. డ్రోన్ లను తిప్పికొడుతూ భారత్ ని సురక్షితంగా ఉంచుతోంది. ఇదిలా ఉండగా.. తాజాగా రాజస్థాన్ నగరంలోని జైపూర్ ఎయిర్ పోర్ట్ లో శబ్దాలు వినిపించినట్లు తెలుస్తోంది. ఆ శబ్దాలు పేలుడు శబ్దాలేనని సమాచారం. బ్లాక్ అవుట్ ఉండడం వల్ల అక్కడ ఏం అవుతుందనేది బయటికి తెలియడం లేదు. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.
ఇక పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్థాన్, పీఓకేలో ఉగ్రశిభిరాలపై మిస్సైల్ దాడులు చేసింది. ఈ దాడులను "ఆపరేషన్ సింధూర్" పేరుతో భారత్ ప్రభుత్వం మొదలుపెట్టింది. భారత్ పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తోంది. భారత్ వరుస దాడులతో పాకిస్థాన్ ని ముప్పు తిప్పలు పెడుతుంది. భారత్ ఆర్మీ పాకిస్తాన్ టెర్రరిస్టులను ఒక్కొక్కరిగా కలుపు మొక్కలను ఏరిపారేసినట్టు ఏరిపారేస్తుంది.