సింధూర్: మళ్లీ పాక్ దాడులు.. అక్కడ బ్లాక్ అవుట్
ఇక పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్థాన్, పీఓకేలో ఉగ్రశిభిరాలపై మిస్సైల్ దాడులు చేసింది. ఈ దాడులను "ఆపరేషన్ సింధూర్" పేరుతో భారత్ ప్రభుత్వం మొదలుపెట్టింది. పాకిస్తాన్ లోని కోట్లీ, మురిడ్కే, బహవల్పూర్, ముజఫరాబాద్ ప్రాంతాలతో పాటు పలు చోట్లలో మెరుపు దాడులు చేసినట్లు భారత్ అధికారికంగా ప్రకటించింది. ఈ దాడికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలో భారత్ పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తోంది. భారత్ వరుస దాడులతో పాకిస్థాన్ ని ముప్పు తిప్పలు పెడుతుంది. దీనికి తోడు భారత్ వెన్నంటే ఎన్నో దేశాలు ఉన్నాయి. భారత్ ఆర్మీ పాకిస్తాన్ టెర్రరిస్టులను ఒక్కొక్కరిగా కలుపు మొక్కలను ఏరిపారేసినట్టు ఏరిపారేస్తుంది. అలాగే పాకిస్తాన్ డ్రోన్ లతో చేసే దాడులను భారత్ ఆకాశ్ క్షిపణి వ్యవస్థ చెక్ పెడుతుంది.