చంద్రబాబు నిర్ణయంతో ఉలిక్కిపడ్డ రేవంత్ రెడ్డి.. కష్టాలు తప్పవా?

frame చంద్రబాబు నిర్ణయంతో ఉలిక్కిపడ్డ రేవంత్ రెడ్డి.. కష్టాలు తప్పవా?

Chakravarthi Kalyan
ఆశా వర్కర్లకు ఏపీ సిఎం చంద్రబాబు వరాలు ప్రకటించారు. ఆశా వర్కర్లకు మొదటి 2 ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవు మంజూరు చేశారు. ఆశా కార్యకర్తల గరిష్ట వయోపరిమితిని అంగన్‌వాడీ కార్యకర్తలతో సమానంగా 62 సంవత్సరాలకు పెంచారు. ఆశా కార్యకర్తలందరికీ ప్రయోజనం చేకూర్చే లా నిబంధనల ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపు చేయనున్నారు.

అంతే కాదు.. ప్రస్తుతం నెలకు రూ.10,000/- వేతనం పొందుతున్న ఆశా వర్కర్లు.. వారి సర్వీస్ ముగింపు సందర్భంగా గ్రాట్యుటీ కింద సుమారు రూ.1.5 లక్షలు అందే అవకాశం లభించింది. ఏపీ రాష్ట్రంలో దాదాపు 42,752 మంది ఆశా కార్యకర్తలు ఉన్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో 37,017 మంది, పట్టణ ప్రాంతాల్లో 5,735 ఆశా వర్కర్లు ఉన్నారు.

అయితే చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో రేవంత్ రెడ్డి కూడా ఇరుకున పడ్డారు. తెలంగాణలో కూడా ఆశా వర్కర్లు ఇదే తరహా పెంపు ఆశిస్తారు. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More