
కుమార్తెను ప్రేమిస్తున్నాడని ఏకంగా చంపి పారేశాడు?
పోలీసులు మాత్రం కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది పూర్తి వివరాలు తర్వాత చెప్తామంటున్నారు. మృతదేహం లభ్యం కాలేదని పోలీసులు చెబుతుండటంతో దశరథ్ మృతదేహాన్ని చూపించాలంటూ నిజాంపేట్ లో రోడ్డుపై బైఠాయించి కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు. మెగ్యానాయక్ తండాలో ఓ బాలికతో చనువుగా ఉండటంతో దశరథ్(26) పై కక్ష పెంచుకున్న తండ్రి గోపాల్ అతడిని చంపేశాడని భావిస్తున్నారు. నాలుగు రోజుల నుంచి దశరథ్ కనిపించకుండా పోయాడు. మృతుడు దశరథ్ కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు దశరథ్ భార్య ఫిర్యాదు చేసింది. మృతుడు దశరథ్ సంగారెడ్డి పరిధిలోని ఓ చెరుకు పరిశ్రమలో లారీ డ్రైవర్ గా తెలుస్తోంది.