ఆ ముఖ్యమైన తెలంగాణ కోరికలు కేంద్రం తీరుస్తుందా?

Chakravarthi Kalyan
ఢిల్లీలో కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి పీయూష్ గోయ‌ల్ ను క‌లిసిన మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు.. రాష్ట్రం కోసం కొన్ని కోరికలు కోరారు.  ఈ నెల 26న హైద‌రాబాద్ లో జ‌ర‌గ‌నున్న బ‌యో ఏషియా 2025 సదస్సుకు హాజ‌రు కావాల‌ని కేంద్రం మంత్రి పీయూష్ గోయ‌ల్ ను ఆహ్వానించిన మంత్రి  శ్రీధ‌ర్ బాబు..  రాష్ట్రంలో పెట్టుబడులను ఆక‌ర్షించేందుకు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ కు వివ‌రించారు.


క‌రీంన‌గ‌ర్ జిల్లా రుక్మాపూర్, జ‌నగాం జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మెగా లెద‌ర్ పార్క్స్ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ ను కోరిన మంత్రి శ్రీధ‌ర్ బాబు..  నేష‌న‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ కారిడార్ డెవ‌లెప్ మెంట్ కార్పోరేష‌న్ జ‌హీరాబాద్ నోడ్ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ ను కోరారు.  ఓసాకా ఎక్స్ పో 2025 సదస్సులో తెలంగాణ భాగ‌స్వామ్యం అవుతుంద‌ని కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ కు మంత్రి శ్రీధ‌ర్ బాబు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: