మాట నిలబెట్టుకున్న రేవంత్.. కొత్త పోస్టులు సృష్టించాడుగా?
ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి నియామకం కోసం సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో రద్దు చేసిన వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.
గత ప్రభుత్వంలో అర్హులైన విఆర్ఓలు ఇతర శాఖలకు బదలాయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారిని వెనక్కి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఇతర శాఖల నుంచి వెనక్కి రప్పించే ప్రక్రియకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇతర శాఖల్లో పని చేస్తున్న వారిలో ఆసక్తి కలిగిన, అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ నెల 28 వ తేదీని గడువు విధిస్తూ సీసీఎల్ ఎ చీఫ్ కమషనర్ నవీన్ మిట్టల్ ఈ మేరకు సర్క్యులర్ ఇచ్చారు.