కలశ ఫౌండర్ కు ప్రతిష్ఠాత్మక ఆసియా ఐకాన్ అవార్డు

Chakravarthi Kalyan

కలశ ఫౌండేషన్ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అతిపిన్న వయస్కు సామాజిక సేవకురాలిగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కలశనాయుడిని మరో పురస్కారం వరించింది. సామాజిక సేవా కార్యక్రమాల్లో  ఆమె చేసిన సేవలకు గాను ఆసియా ఐకాన్ అవార్డు-2024 దక్కింది.  ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కలశనాయుడిని ఆసియా ఐకాన్ అవార్డుతో సత్కరించారు.


శ్రీలంక రాజధాని కొలంబోలో సెప్టెంబరు 26, 27 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగిన ఆసియా ఐకాన్-2024 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సోషల్ సర్వీసెస్ కేటగిరిలో డా. కలశ నాయుడు ఆసియా ఐకాన్‌-2024 అవార్డు తీసుకున్నారు.


కొలొంబో గవర్నర్ సెంథిల్ తంగవాన్ చేతుల మీదుగా కలశ నాయుడు ఈ అవార్డును అందుకున్నారు. అంతే కాదు సోషల్ సర్వీసెస్ లో అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కురాలిగా కూడా రికార్డు నెలకొల్పారు. ఆసియా ఖండంలోనే వివిధ రంగాల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన పలువురు వ్యక్తులు సైతం అదే వేదికపై ఆసియా ఐకాన్-2024 అవార్డు అందుకున్నారు.


ఈ కార్యక్రమంలో శ్రీలంక మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. కలశ ఫౌండేషన్ ద్వారా డా. కలశనాయుడు పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో విద్య, వైద్యం, ఆరోగ్య రంగాల్లో సేవలందిస్తున్నారు. అంతేకాదు ప్రతిభ ఉన్నా చదువుకు దూరం అవుతున్న విద్యార్థుల కోసం స్టూడెంట్ ఫర్ స్కాలర్ షిప్స్ అందిస్తూ తన వంతు సాయం చేస్తున్నారు. ఐదేళ్ల వయసులోనే అతి చిన్న వయసు సామాజిక సేవకురాలిగా ఖ్యాతి తెచ్చుకున్న డా. కలశనాయుడు భవిష్యత్తులో కూడా ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ సామాజిక సేవా రంగంలో అత్యున్నత శిఖరాలకు చేరాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: