ఏపీ: జానీమాస్టర్ పై సంచలన నిర్ణయం తీసుకున్న జనసేన.!

FARMANULLA SHAIK
దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్‌పై  అత్యాచారం కేసు నమోదయిన విషయం తెలిసిందే.గ్రూప్ డ్యాన్సర్స్ లో ఒకడిగా కెరీర్ ని ప్రారంభించిన జానీ మాస్టర్, ఆ తర్వాత కొరియోగ్రాఫర్ గా మారి నేడు ఇండియా లో నెంబర్ 1 కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే.రెండు సార్లు ఆయన నేషనల్ అవార్డు ని కూడా అందుకున్నాడు. అంతే కాదు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ లో చేరి, ఆ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారం లో విస్తృతంగా పర్యటించి, పలు సేవా కార్యక్రమాలు కూడా చేసాడు. అలాంటి జానీ మాస్టర్ పై నేడు ఒక యువతీ లైంగిక వేధింపులు చేశాడంటూ పోలీస్ స్టేషన్ లో కేసు వేసింది. ఈ సందర్భంగా జానీ మాస్టర్ పై హైదరాబాద్ లోని నార్సింగి పోలీస్ స్టేషన్ FIR నమోదు అయ్యింది. ఈ FIR కాపీ లో సంచలన నిజాలు బయటపడ్డాయి. తన డ్యాన్స్ బృందం లో పని చేసే అమ్మాయి పై జానీ మాస్టర్ నిత్యం లైంగిక వేధింపులు చేసేవాడట. 2019 వ సంవత్సరం లో ఢీ షో ద్వారా జానీ మాస్టర్ పరిచయం అయ్యాడని, ఆ తర్వాత తనని మాస్టర్ టీం లోకి తీసుకున్నాడని, అవుట్ డోర్ షూటింగ్ సమయంలో జానీ మాస్టర్ చెన్నై, హైదరాబాద్, ముంబై వంటి సిటీస్ తో సహా, పలు ప్రాంతాలలో తనపై లైంగిక దాడి చేసాడని, నేను ప్రతిఘటించినందుకు నాపై భౌతిక దాడి కూడా చేసాడని యువతి FIR లో పేర్కొనింది.
తన శృంగార వాంఛలు తీర్చేందుకు తనని వివాహం చేసుకోవాలని, ఒకవేళ వివాహం చేసుకోకుంటే ఇండస్ట్రీ లో భవిష్యత్తు అనేదే లేకుండా చేస్తానని బెదిరించాడని ఆ యువతి ఈ సందర్భంగా పేర్కొనింది. ఈ విషయం లో జానీ మాస్టర్ భార్య కూడా ఆయనకీ సహాయం చేసేదని చెప్పుకొచ్చింది. క్యార వ్యాన్ లో అనేక సార్లు జానీ ప్యాంట్ విప్పి తనపై లైంగికంగా దాడి చేసాడు అంటూ ఆ FIR లోని విషయాలు బయటపడ్డాయి. అయితే ఈ విషయంపై జానీ మాస్టర్ పేరిట ఐపీసీ సెక్షన్ 376 , 506 , 323 (2)(N) క్రింద కేసులు నమోదు అయ్యాయి. పొద్దున్న నుండి ఈ కేసు మీద సోషల్ మీడియా లో ఈ స్థాయిలో చర్చలు జరుగుతుంటే, జానీ మాస్టర్ నుండి ఎలాంటి స్పందన రాకపోవడం తో అభిమానుల్లో అనుమానాలు ఇంకా బలమయ్యాయి.ఈ నేపథ్యంలో రాజకీయాల్లో మార్పులకు శ్రీకారం చుడుతాం అంటూ ప్రకటించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్… తను చెప్పిన మాటలను ఆచరణలో పెట్టే ప్రయత్నంలో విజయవంతంగా కొనసాగుతున్నారు.
 ముఖ్యంగా మహిళలపై వేధింపుల విషయంలో పార్టీ పంపిన స్ట్రాంగ్ సిగ్నల్స్ ఎంతో ప్రభావం చూపనున్నాయి. కొంతకాలంగా వైసీపీ నేతలతో పాటు ఆనాడు కీలకంగా ఉన్న అధికారులపై సైతం ఎన్నో ఆరోపణలు. జత్వానీ కేసు ఒక్కటే కాదు బయటకు రాకుండా మహిళలపై జరిగిన కీచకపర్వాలు ఎన్నో. స్వయంగా తమ పార్టీ నేతలపై ఆధారాలతో సహా బయటకు వస్తున్నా వైసీసీ రెస్పాండ్ కాదు. జగన్ నోరు తెరవరు. కానీ, తనతో…జనసేనతో చాలా కాలంగా కొనసాగుతున్న జానీ మాస్టర్ పై వేధింపుల కేసు నమోదైంది. తన టీంలో ఉన్న ఓ మహిళా కొరియోగ్రాఫర్… జానీ మాస్టర్ పై కేసు పెట్టింది. కేసు నమోదు కావటం, ఎఫ్.ఐ.ఆర్ కూడా బుక్ అయినా జానీ మాస్టర్ స్పందించకపోవటంతో జనసేన సీరియస్ గా తీసుకుంది. జనసేన కార్యక్రమాల నుండి తనను దూరంగా ఉంచుతున్నట్లు ప్రకటన విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ సూచనతో పార్టీ అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: