కేంద్రం సాయంపై బిగ్ ట్విస్ట్.. స్పందించిన సీఎం చంద్రబాబు..!

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలు కారణంగా వరదలు సంభవించాయి. దీంతో ఇరు రాష్ట్రాల్లో వేల కోట్ల నష్టం వాటిల్లింది.వర్షాలు, వరదలతో భారీ నష్టాన్ని చవి చూసిన తెలుగు రాష్ట్రాలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారీ సాయం ప్రకటించినట్టు వార్తలు గుప్పుమన్నాయి.. వరద సాయంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం రూ.3,300 కోట్ల నిధులు విడుదల చేసినట్టు ప్రచారం జరిగింది.. అయితే, ఈ వ్యవహారంలో ఊహించని ట్విస్ట్‌ వచ్చి చేరింది.. కేంద్రం సాయం చేసింది అనే వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రూ.3300 కోట్లు వచ్చాయన్నది పుకారు మాత్రమే.. మాకైతే ఇంతవరకు ఎలాంటి సమాచారం రాలేదు అన్నారు.. మేం ఇంకా ప్రాథమిక నివేదిక పంపలేదు, రేపు ఉదయం నష్టం అంచనా పై ప్రాథమిక నివేదిక పంపుతాం అన్నారు సీఎం చంద్రబాబు..శుక్రవారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు… కేంద్ర సాయంపై రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. రాష్ట్రం నుంచి ఇంకా నివేదికలే పంపలేదని చెప్పారు. రూ. 3300 కోట్ల సహాయం అంటూ వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. దీనిపై తమకు కేంద్రం నుంచి ఎలాంటి సమాచారం కూడా లేదన్నారు. వరద నష్టం అంచనాపై శనివారం ఉదయం కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపుతామని తెలిపారు.బాధితులకు సహాయం విషయంలో కేంద్రంతో పాటు బ్యాంకర్లతో మాట్లాడుతున్నామన్నారు.భీమా కట్టిన వారందరిని త్వరగా ఆదుకోవాలని కోరుతున్నామని తెలిపారు.ఇదిలావుండగా మూడు రోజుల్లో ప్రతి ఒక్కరికీ కూటమి ప్రభుత్వం నిత్యావసర వస్తువులు ఇచ్చే విధంగా చూస్తున్నాం.ఈ నిత్యావసర వస్తువులు ఇచ్చిన రోజు, డ్రై ఫుడ్ కింద, మరో కిట్ కూడా ఇస్తాం. ఈ ప్యాకేజి మీకు వచ్చే వరకు, ఆహారం కూడా సరఫరా చేస్తాం. కుటుంబానికి 25 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ చక్కర, 1 లీటర్ పామాయిల్, 2 కేజీల బంగాళాదుంపలు, 2 కేజీల ఉల్లిపాయలు అందిస్తున్నాం. చిన్నాపెద్దా వ్యత్యాసం లేకుండా అందరికీ ఇవి ఇస్తున్నాం. ప్రకృతికి ఏ తేడా లేకుండా అందరి మీద ప్రభావం చూపించింది. ప్రజలు ఇచ్చే ఫీడ్ బ్యాక్ బట్టి అప్పటివరకూ ఫుడ్ అందిస్తామని’ ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: