బిగ్ బ్రేకింగ్: చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం...!

FARMANULLA SHAIK
బుడమేరు వాగు ఉధృతికి విజయవాడ నగరం సగం మునిగిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.వరద సహాయక చర్యలను పరిశీలిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పెను ముప్పు తప్పింది. జస్ట్ మూడు అడుగుల దూరంలో ట్రైన్ ఆగిపోవడంతో ప్రమాదం తప్పినట్లయ్యింది. భారీ వర్షాల కారణంగా పొంగిన వరదలు ఇంకా విజయవాడను వీడలేదు. పలు ప్రాంతాల్లో ఇప్పటికీ బుడమేరు వరద ప్రవహిస్తోంది. దీంతో ఇప్పటికీ సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఈ సహాయక కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. బుడమేరు కింద నుంచి ప్రవహిస్తుండటంతో సరిగా కనిపించడం లేదని రైల్వే ట్రాక్ ఎక్కిన సీఎం చంద్రబాబు ఈ క్రమంలో స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగానే సీఎం చంద్రబాబు ముధరా నగర్ రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్తున్నారు.అదే సమయంలో ట్రాక్‌పై నుంచి ట్రైన్ వస్తోంది. ఇది గమనించిన భద్రతా సిబ్బంది.. ట్రైన్ వస్తోందని, అక్కడి నుంచి వెళ్దామని చెప్పారు. మరోవైపు విషయాన్ని గమనించిన చంద్రదండు కార్యకర్తలు.. లైన్‌మెన్‌ను అలర్ట్ చేశారు. అతను ట్రైన్‌కు ఎర్రజెండా ఊపడంతో ట్రైన్ స్లో అయ్యింది. చంద్రబాబు భద్రతా సిబ్బంది ఆయన చుట్టూ సరౌండ్ అయ్యారు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుబాబు కూడా చంద్రబాబు వెన్నంటి ఉన్నారు. ట్రైన్ సరిగ్గా మూడు అడుగుల దూరంలో ఆగిపోయింది.పూర్తి వివరాల్లోకి వెళితే విజయవాడ మధురానగర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు తృట్టిలో ప్రమాదం తప్పింది. వరద ప్రాంతాల పరిశీలనకు రైలు వంతెనపైకి వెళ్లిన సీఎం.... భద్రతా సిబ్బంది వారించినా ఆగలేదు. వంతెనపై నడుస్తూ బుడమేరును పరిశీలించారు. ఆ క్రమంలో వంతెనపై నడుస్తుండగానే ఎదురుగా వచ్చిన రైలు.... ముఖ్యమంత్రి చంద్రబాబుకు అతి సమీపంగా వెళ్లింది. కొంచెం పక్కకు నిలబడి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ హఠాత్‌ పరిణామంతో ఆందోళన చెందిన అధికారులు, భద్రతా సిబ్బంది.... ప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: