గుడ్లవల్లేరు ఘటనపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

FARMANULLA SHAIK
గూడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఉదాంతం గురించి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద కలకాలమే రేగింది. అమ్మాయిల హాస్టల్ బాత్రూం లో సీక్రెట్ కెమెరా పెట్టి వీడియోలు రికార్డు చేసారు అంటూ ఈరోజు ఉదయం నుంచి న్యూస్ అయింది. కళాశాల హాస్టల్స్ లో నిన్న రాత్రి నుండి ఈ విషయంపై విద్యార్థులు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు.. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, మరియు కళాశాల నిర్వహణ సిబ్బంది సమక్షంలో పోలీసులు ఎలక్ట్రానిక్ పరికరాలను కనుగొనే డివైస్ తో తనిఖీలు చేపట్టారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడు ఈ ఘటనపై స్పందించారు. ఆయన దీన్ని గమనించి, సమగ్ర పోలీసు విచారణను ఆదేశించారు. ఆ తరువాత విద్యార్థులు మరియు కళాశాల యాజమాన్యం మధ్య పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి. పోలీసుల తనిఖీలలో ఎటువంటి ఎలక్ట్రానిక్ కెమెరా పరికరాలను కనుగొనలేదు. అందువల్ల, ప్రస్తుతం విద్యార్థులకు సోమవారం సెలవులు ప్రకటించారు. అప్పటిలోగా పోలీసులు మరొకసారి హాస్టల్స్ ని తనిఖీ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రచారాల పట్ల విద్యార్థులు,  తల్లిదండ్రులు అప్రమత్తం గా వుండాలని, తప్పు చేసిన ఎవ్వరిని వదిలిపెట్టబోమని సీఎం హెచ్చరించారు.'చిత్రీకరించిన వీడియోల విషయంలో విద్యార్థినిలు, వారి తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదు. వీడియోలు తీసి ఉంటే ఒక్క వీడియో కూడా బయటకు రాకుండా చేయడానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నిశ్చింతగా ఉండండి. ఆడబిడ్డల పట్ల త్పుగా ప్రవర్తించారని తేలితే వారు ఎవరైనా, ఎంతటి వారైనా వదిలి పెట్టం. ఈ ఘటనపై జరుగుతున్న దర్యాప్తు వివరాలను ప్రతి మూడు గంటలకు ఒకసారి నాకు రిపోర్ట్ చేయాలి'' అని చంద్రబాబు ఆదేశించారు.ఈ ఘటన విషయంలో విచారణను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మన ఇంట్లో ఆడబిడ్డలకు కష్టం వస్తే ఎలా స్పందిస్తామో.. ఇప్పుడు కూడా అలానే, అంతే సీరియస్‌గా స్పందించాలని కోరారు. వీలైనంత త్వరగా ఈ సీక్రెట్ కెమెరా వివాదం నిగ్గు తేల్చాలని చెప్పారు. ''ఆందోళనలో ఉన్న వారికి భరోసా కల్పించాలి. విద్యార్థుల ఫిర్యాదును కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందన్న ఆరోపణపై కూడా దర్యాప్తు చేయండి. ఈ విషయంలో కాలేజీ యాజమాన్యం, అధికారుల అలసత్వం ఉన్నట్లు నిర్ధారితమైతే చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. విద్యార్థులు ఎవరి దగ్గరైనా ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు ఉంటే నేరుగా నాకే పంపండి. వాటిని బట్టి చర్యలు తీసుకుంటాం'' అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: