నేపాల్: ఘోర ప్రమాదానికి గురైన భారతీయ ప్రయాణికులు..!

FARMANULLA SHAIK
 నేపాల్‌ తనహున్ జిల్లాలోని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అబుఖైరేని ప్రాంతంలోని మర్స్యంగ్డి నదిలో భారతీయ ప్రయాణీకుల బస్సు పడిపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న 40 మందిలో 14 మంది ప్రయాణికులు మృత్యువు ఒడికి చేరుకున్నారు. మిగతా వారిని రక్షించినట్లు నేపాల్ పోలీసులు తెలిపారు. తాన్‌హున్‌కు చెందిన డీఎస్పీ దీప్‌కుమార్ రాయ్ వివరాల ప్రకారం.. UP 53 FD 7623 నంబర్ ప్లేట్ ఉన్న బస్సు నదిలో పడిపోయింది. ప్రస్తుతం బస్సు నది ఒడ్డుకు చేరుకుంది. స్థానిక పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. సహాయక చర్యలలో 14 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన 16 మంది ప్రయాణికులను రక్షించారు. ఈ బస్సు పోఖారాలోని మజేరి రిసార్ట్‌లో బస చేసిన భారతీయ ప్రయాణికులను తీసుకుని ఖాట్మండుకు బయలుదేరింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.ఈ క్రమంలో తనాహున్ జిల్లాలోని ఐరా పహారా ప్రాంతానికి చేరుకోగానే బస్సు అదుపుతప్పి మర్స్యాంగ్డి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదం శుక్రవారం ఉదయం 11.30 గంటలకు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న నేపాల్ ఆర్మీ సహాయక చర్యల కోసం రంగంలోకి దిగింది. 45మందితో కూడిన  రెస్క్యూ టీమ్ ప్రమాదస్థలికి చేరుకుని 29మంది ప్రయాణికులను రక్షించి ఆస్పత్రికి తరలించింది. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలియాల్సి ఉంది.మరోవైపు, నేపాల్ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. నేపాల్ ఆర్మీకి చెందిన MI-17 హెలికాప్టర్లో మెడికల్ టీమ్ను ఘటనాస్థలికి పంపించింది.ఇదిలా ఉండగా, ఈ దుర్ఘటనపై ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ అధికారి స్పందించారు. అక్కడి స్థానిక అధికారులతో మాట్లాడి సమాచారం తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు.నేపాల్‌లో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం, కొండలు మరియు లోయల రోడ్లపై బస్సులు అదుపు తప్పి నదుల్లోకి పడిపోవడం గురించి అనేక నివేదికలు ఉన్నాయి. దీని వల్ల పెద్ద సంఖ్యలో ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోంది. చాలా సార్లు భారతీయ పౌరులు ఈ ప్రమాదాల బారిన పడ్డారు. ఈ సంఘటనలకు కారణాలు తరచుగా అధ్వాన్నమైన రహదారి పరిస్థితులు, బస్సుల నిర్వహణ సరిగా లేకపోవడం, అజాగ్రత్తగా నడపడం. భారతీయ పౌరుల మరణం రెండు దేశాల మధ్య రహదారి భద్రతపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని హైలైట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: