తెలంగాణకు గుడ్‌న్యూస్‌.. వాళ్లు సమ్మె విరమించారు?

Chakravarthi Kalyan
సమ్మె తాత్కాలికంగా నిలిపివేస్తూన్నటు ప్రకటించిన జూనియర్ వైద్యులు ప్రకటించారు.  డిఎంఈ, ఆరోగ్య శాఖ అధికారులతో అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలు ఫలించాయి. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో జూడాలకు వసతి భవనాల కోసం  నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం నుంచి హామీ ఇవ్వడంతో జూనియర్ వైద్యులు సమ్మె విరమించారు. అలాగే కాకతీయ యూనివర్సిటీ లోను రహదారుల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని ప్రభుత్వం నుంచి హామీ లభించిందని జూనియర్ వైద్యులు తెలిపారు.

ఈ రోజు రెండు జీవోలు విడుదల చేస్తామని సర్కారు హామీ ఇచ్చిందని జూనియర్ వైద్యులు అంటున్నారు. ఇవాళ జీవోలు విడుదల కానీ పక్షంలో రేపు తిరిగి సమ్మె ప్రారంభిస్తామని జూనియర్ వైద్యులు ప్రకటించారు. జిల్లాల్లోని జూడాలను ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చర్చలకు పిలిచారు. దీంతో సమ్మెకు బ్రేక్ పడింది. జీవోలు రాకపోతే మాత్రం మళ్లీ సమ్మె తప్పకపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: