గ్రూప్‌1: ఓఎంఆర్‌ షీట్లు పెట్టకుండా.. కీ ఇచ్చి ఏం లాభం? తలాతోకా లేని టీజీపీఎస్సీ తీరు?

Chakravarthi Kalyan
ఈనెల 9న గ్రూప్‌ వన్‌ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన టీజీపీఎస్సీ.. ఇటీవల ఆ పరీక్షకు సంబంధించిన ప్రాధమిక కీను విడుదల చేసింది. ఆ కీపై అభ్యంతరాలు ఉంటే.. ఈనెల 17లోగా కమిషన్‌ వెబ్‌ సైట్‌ ద్వారా అభ్యంతరాలు నమోదు చేయాలని తెలిపింది. ఇందుకు అభ్యర్థి తన టీజీపీఎస్సీ ఐడీ, హాల్‌ టికట్‌ నెంబర్‌ ద్వారా లాగిన్‌ కావచ్చని సూచించింది.

పరీక్ష నిర్వహించిన నాలుగైదు రోజుల్లోనే ప్రాధమిక కీ విడుదల చేయడంలో టీజీపీఎస్సీ చొరవ అభినందించదగిందే అయినా.. అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లు మాత్రం అప్‌లోడ్‌ చేయలేదు. ఓఎంఆర్‌ షీట్లు ఆన్‌లైన్‌లో పెట్టకుండా కీ ఇస్తే పరీక్ష రాసిన అభ్యర్థులు ఎలా చెక్‌ చేసుకుంటారన్న చిన్న లాజిక్‌ను కమిషన్‌ మరిచినట్టు కనిపిస్తోంది. పరీక్ష రాసిన అభ్యర్థులు తాము ఏ సమాధానాలు పెట్టామో గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం. అలాంటప్పుడు కీతో పాటు ఓఎంఆర్‌ కూడా ఇవ్వాల్సి ఉంది. గతంలో ఇలాగే ఇచ్చిన కమిషన్ ఇప్పుడు ఓఎంఆర్‌ ఇవ్వడం మరిచింది. కమిషన్‌ త్వరగా ఓఎంఆర్‌ షీట్లు అప్‌లోడ్‌ చేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: