మోడీ తర్వాత ఆయనేనా.. తేల్చి చెప్పేసిన అమిత్‌షా?

Chakravarthi Kalyan
మోదీ తర్వాత అమిత్ షా పగ్గాలు చేపడతారంటూ, అందుకే మోదీ ఓట్లు అడుగుతున్నారని చెప్పారు. అయితే దీనిపై వెంటనే అమిత్ షా స్పందించారు. 75 ఏళ్లు నిండిన తర్వాత కూడా మోదీయే ప్రధానిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. ఆ తర్వాత కూడా ఆయన సూచనల మేరకే బీజేపీ ప్రభుత్వం నడుస్తుందని వివరించారు.
ఇప్పుడు మోదీ వారసుడిని నిర్ణయించడం కూడా పెద్ద సవాల్ తో కూడుకున్నదే. వాస్తవానికి బీజేపీలో నాయకత్వానికి కొరత ఉండదు. ఎవరైనా పార్టీ అధ్యక్ష  పదవి, ప్రధాని పదవి చేపట్టవచ్చు. బీజేపీలో ఏదైనా సాధ్యమే. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లో సీఎంల మార్పు.  నరేంద్ర మోదీ ప్రధాని అభ్యర్థిగా 2012 వరకు ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు 2029 వరకు ఆయనే ప్రధాని అని షా చెప్పారు కాబట్టి.. ఆయన వారసుడి ప్రకటన ఇప్పట్లో లేనట్టే. ఆ సమయానికి ఎవరు తెరపైకి వస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: