చిత్రపురిలో రూ. 3000 కోట్ల కుంభకోణం..?

Chakravarthi Kalyan
రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ పాలన అని గుర్తుకు తెస్తున్నారని భారాస నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. చిత్రపురి కాలనీలో 3000 కోట్ల అవునీతి జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ఆరోపణలు చేశారని, దాన్ని సామాజిక మాధ్యమాల్లో పెడితే పోలీసులు తనపై కేసు నమోదు చేశారని అన్నారు. డేటా గోప్యతపై సుప్రీంకోర్టు గతంలో అనేక తీర్పులు ఇచ్చిందని... రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ఉన్నత న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని అన్నారు.
గతంలో రేవంత్ రెడ్డి భారాస ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తే అప్పుడు ఫోన్ చేశారా అని ప్రశ్నించిన క్రిశాంక్... తాము అణచివేస్తే రాజకీయాలు చేసేవారా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేయలేదా అని అడిగారు. చిత్రపురి సొసైటీ కోశాధికారి అనుముల మహానందరెడ్డి ఎవరో తెలియదని అంటున్నారని.. ఆయన సీఎం రేవంత్ రెడ్డి దిగిన ఫోటోలు ఉన్నాయని తెలిపారు. చిత్రపురిలో 3000 కోట్ల కుంభకోణంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు విచారణ చేయడం లేదని క్రిశాంక్ ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: