పవన్ కల్యాణ్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి పిఠాపురం స్థానం ఎంచుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఒక్క చోట కూడా గెలవలేకపోయిన పవన్ కల్యాణ్.. ఈ సారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని పట్టుదలతో ఉన్నారు. అందుకు భీమవరం వదిలేసి పిఠాపురాన్ని ఎంచుకున్నారు. అయితే.. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఆ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. జనసేన పిఠాపురం మాజీ ఇన్‌ఛార్జి మాకినీడి శేషు కుమారి అనూహ్యాంగా పార్టీని వీడిపోయారు.
ఆమె తాజాగా వైసీపీ లో చేరిపోయారు. తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో వైయస్ జగన్ సమక్షంలో మాకినీడి శేషు కుమారి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో శేషు కుమారి జనసేన తరుపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. ఈ చేరిక కార్యక్రమంలో పి.వి.మిథున్‌రెడ్డి, పిఠాపురం వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త వంగా గీత పాల్గొన్నారు.